హార్ముజ్ తర్వాత ఎర్ర సముద్రం కూడా బంద్? పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ అమెరికా గనుక తమ దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడికి దిగితే ఎర్రచముద్రం చమురు రవాణా మార్గాన్ని పూర్తిగా మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులను ఆదేశించింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాకు సరికొత్త, పెనుముప్పు పొంచి ఉందని.. అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఇరాన్ ఉన్నత వర్గాలు వెల్లడించారు.
ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ మిత్రపక్షమైన హౌతీ గ్రూపునకు ఇప్పటికే స్పష్టమైన సందేశాలను పంపినట్లు సమాచారం. ఇరాన్ అండతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రపు ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-ముండేబ్ జలసంధి సమీపంలో భారీగా క్షిపణులు, డ్రోన్లను మోహరించారు. కేవలం ఇరాన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ ఇంధన సంక్షోభానికి కొత్త ముప్పు
ప్రస్తుతం ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి ఇప్పటికే మూసివేయబడిన సంగతి తెలిసిందే. కాబట్టి ఎర్ర సముద్రంలోని ఓడలు లేదా ఓడరేవులపై హౌతీలు చేసే ఏ దాడి అయినా మిడిల్ ఈస్ట్‌కు చెందిన రెండు ప్రధాన చమురు ఎగుమతి మార్గాలు ఏకకాలంలో స్తంభించిపోతాయి. ఈ ప్రాంతం ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో కలుపుతుంది. ప్రపంచ చమురు సరఫరాకు ఇది అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం, అమెరికాతో ఇరాన్‌కు ఉన్న ప్రధాన వైరం నేపథ్యంలో, ఈ మార్గానికి అంతరాయం కలగడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
బాంబు దాడితో కాల్పుల విరమణ ఒప్పందం భంగం
హౌతీలకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే యెమెన్‌లో ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతినిధులు బాబ్ అల్-మండేబ్ జలసంధిని ఎప్పుడు మూసివేయాలనే నిర్ణయాన్ని నియంత్రిస్తారు.ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు సంకేతంగా.. తమ నియంత్రణలో ఉన్న విమానాశ్రయంపై సౌదీ అరేబియా బాంబు దాడి చేసిందని ఆరోపిస్తూ హౌతీలు ఇటీవల ఆ దేశంపై క్షిపణులను ప్రయోగించారు. దీనితో సౌదీ అరేబియా, ఆ గ్రూపు మధ్య నెలకొన్న ఘర్షణలో నాలుగేళ్ల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించబడింది. ఈ ముప్పును సౌదీ అరేబియా తీవ్రంగా పరిగణిస్తోందని ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి రోజుల్లో హౌతీలు, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. సౌదీ అరేబియా కూడా ఈ తాజా ముప్పును అత్యంత తీవ్రంగా పరిగణస్తోంది.
JUST IN:
— Current Report (@Currentreport1) July 16, 2026
Iran has asked Yemen's Houthi to prepare to close Red Sea oil shipping routes if the United States attacks Iran's power infrastructure – Reuters pic.twitter.com/O4NQP44VGf












Click it and Unblock the Notifications