ఇమ్రాన్ ఖాన్ భార్య రెహాం కోసం రూ.3లక్షల నెక్లెస్ కొన్న విపక్షం
కరాచీ: ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) నాయకులు కిష్వార్ జాహ్రా రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ భార్య రెహామ్ ఖాన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహామ్ ఖాన్‌కు రెండు లక్షల తొంభై వేల రూపాయల విలువ గల నెక్లెస్‌ను తమ పార్టీ కొని పెట్టిందన్నారు.
ఎంక్యూఎం పార్టీ ఈ నెక్లెస్ కొని పెట్టిందని, ఇమ్రాన్, రెహామ్ ఖాన్ కరాచీ వచ్చినప్పుడు దానిని రెహామ్ ఖాన్‌కు ఇస్తామని చెప్పారు. అయితే, కరాచీ వచ్చిన రెహామ్ ఖాన్ దానిని అందుకోలేదు.

అంతేకాదు, దీనిపై రెహామ్ ఖాన్ స్పందిస్తూ.. తనకు తన భర్త ఇమ్రాన్ ఖానే పెద్ద బంగారం అన్నారు. దీనిపై ఎంక్యూఎం నేతలు స్పందిస్తూ... ఈ నెక్లెస్ బహుమతిని తాము రెహామ్ ఖాన్ ఇంటి చిరునామాకు పంపిస్తామని చెప్పారు. ఓ డ్రెస్, సాండిల్స్ ఇమ్రాన్ ఖాన్‌కు పంపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications