పాకిస్థాన్‌కు బిగ్ షాక్: ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’గా స్వాతంత్య్ర ప్రకటన!

పాకిస్థాన్‌కు షాక్ ఇస్తూ బలూచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించుకుంది. బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఇకపై 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్'గా గుర్తించాలని ప్రకటించారు. కానీ ఓ స్వతంత్ర దేశాన్ని సృష్టించడం అంత సులభం కాదు. వేర్పాటువాదులు తాము స్వాతంత్య్రం ప్రకటించుకున్నామని, ఆ ప్రాంతంలోని చాలా భాగాలను నియంత్రిస్తున్నామని వాదిస్తున్నారు. కేవలం స్వాతంత్య్ర ప్రకటన చేసినంత మాత్రాన బలూచిస్థాన్ ఓ స్వతంత్ర దేశంగా మారిపోదు. బలూచిస్తాన్ ఇప్పటికీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది.

ఒకవేళ బలూచ్ ఉద్యమం ఊపందుకుందని ఒక్క క్షణం అనుకున్నా, స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం, ఆ ప్రకటనను గుర్తింపు పొందిన సార్వభౌమ దేశంగా మార్చడం అనేది చాలా కష్టం. అంతర్జాతీయ చట్టం స్వతంత్ర దేశ హోదాకు కొన్ని సూత్రాలను నిర్దేశించినప్పటికీ.. గుర్తింపు సాధించడంలో భౌగోళిక రాజకీయాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి.చరిత్రను పరిశీలిస్తే.. గతంలో అనేక ప్రాంతాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నప్పటికీ.. చాలా తక్కువ ప్రాంతాలు మాత్రమే అంతర్జాతీయ గుర్తింపును సాధించాయని తెలుస్తోంది. ఆ దేశం ఓ స్వతంత్ర దేశంగా వ్యవహరిస్తుందని నిరూపించుకోగలదా, మరియు ఇతర దేశాలు దానిని గుర్తించడానికి సుముఖంగా ఉన్నాయా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు షరతులూ బలూచిస్తాన్‌కు చాలా కష్టంగా మారాయి.

Republic of Balochistan Declares Independence From Pakistan Will India Support it or Can China Veto it

అంతర్జాతీయ చట్టంలో అత్యంత తరచుగా ఉదహరించబడే పత్రం 1933 నాటి మాంటెవిడియో కన్వెన్షన్. దీని ప్రకారం ఓ సార్వభౌమ రాజ్యానికి నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మొదటిది శాశ్వత జనాభా, రెండోది స్పష్టమైన సరిహద్దులు, మూడోది సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వం, నాలుగోది ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు జరిపే సామర్థ్యం ఉండాలి. బలూచిస్థాన్‌కు జనాభా ఉన్నప్పటికీ.. దాని సరిహద్దులు పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో విస్తరించి ఉన్నాయి. కాబట్టి బలూచిస్థాన్ కు సరిహద్దులపై నియంత్రణ సాధించడం, ప్రజల అవసరాలు తీర్చగల ప్రభుత్వాన్ని నడపడం బలూచ్ తిరుగుబాటుదారులకు సవాలుగా మారింది.

గుర్తింపు పొందడం ఎందుకు ముఖ్యం?
ఇతర దేశాల గుర్తింపు, దౌత్యపరమైన ఆమోదం లేకుండా తనను తాను ఓ దేశంగా ప్రకటించుకున్న ప్రాంతానికి ఈ పనులను చేయడం కష్టమవుతుంది. అంతర్జాతీయ సంస్థలలో చేరడం, విదేశాల్లో రాయబార కార్యాలయాలను తెరవడం, పాస్‌పోర్టుకు గుర్తింపు పొందడం, ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థను ఉపయోగించడం, అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయడం, ప్రపంచ దౌత్యంలో పూర్తిస్థాయిలో పాల్గొనడం.. ఇవన్నీ గుర్తింపునకు అవసరమైన కీలక దశలు. బలూచిస్తాన్ ప్రస్తుతం వీటిని సాధించగలిగే స్థితిలో లేదు. ఒక దేశంగా గుర్తింపు పొందాలంటే ఇతర దేశాల గుర్తింపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ను ఓ స్వతంత్ర దేశంగా భారత్ లేదా ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాలు గుర్తిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి బలూచిస్థాన్ పాలన ఇంకా పాకిస్థాన్ నియంత్రణలోనే ఉంది.

బలూచిస్తాన్ ఐక్యరాజ్యసమితి నుండి గుర్తింపు పొందగలుగుతుందా?
చివరగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందడం అనేది బలూచిస్థాన్ కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఐక్యరాజ్యసమితిలో చేరే ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ఐక్యరాజ్యసమితిలో చేరాలంటే, దరఖాస్తు మొదట 15 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం పొందాలి. ఐరాసలోని భద్రతా మండలిలో 15 దేశాల్లో 9 దేశాల మద్దతు ఉండాలి. దీనికి మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు వీటో అధికారాన్ని ఉపయోగించకూడదు. చైనాకు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటమే కాకుండా, బలూచిస్తాన్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. అందువల్ల, బలూచిస్తాన్ ఓ ప్రత్యేక దేశంగా ఏర్పడకుండా అడ్డుకోవడాని చైనా ఒక్క వీటో చాలు. చైనా ఆమోదం లేకుండా, అది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. అందువల్ల, ప్రస్తుతం బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందుతుందనే ఆశ చాలా తక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+