ఇండియానా..? పాకిస్థానా..? ఎవరు ముఖ్యం..? ఒక్క ముక్కలో తేల్చేసిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2025లో నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (GDP) ప్రకారం ప్రపంచదేశాలతో పోల్చితే అమెరికా అగ్రస్థానంలో ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ(PPP) ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనేక దేశాలు ఉవ్విళ్లూరుతుంటాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాక ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)లో భాగంగా ట్రంప్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అయితే తాజాగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ , పాకిస్థాన్ దేశాలతో తమకున్న సంబంధాలపై మాట్లాడారు. పాకిస్థాన్ తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింతగా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా- పాకిస్థాన్ రిలేషన్స్ పై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
" పాకిస్థాన్ తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింత విస్తరించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అయితే భారత్ తో అమెరికాకు ఉన్న చారిత్రాత్మక, ముఖ్యమైన, ధృడమైన వాణిజ్య సంబంధాలతో సమానం కాదు" అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చిన నేపథ్యంలో పాకిస్థాన్- అమెరికా మధ్య సంబంధాలు బలపడ్డాయా..? అన్న ప్రశ్నకు రూబియో సమాధానం ఇస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలతో మాట్లాడి సీజ్ ఫైర్ కు కృషి చేశారని స్పష్టం చేశారు. భారత్- పాకిస్థాన్.. ఇరు దేశాలతోనూ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే భారత్ నుంచి సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిసని.. కానీ పాక్ తోనూ తమకు ఎన్నో ఏళ్ల నుంచి వాణిజ్య చరిత్ర ఉందని మార్కో రూబియో తెలిపారు. రానున్న రోజుల్లోనూ పాకిస్థాన్ తో మరిన్ని ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. అయితే భారత్ తో అమెరికా ఉన్న వాణిజ్య సంబంధాలతో వాటిని పోల్చలేమని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా- భారత్ మధ్య సత్సంబంధాలు ఆందోళన స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్ పై 25 శాతం అధిక సుంకాలు మోపింది అమెరికా. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. భారత్ చమురు కొనుగోలుతో పరోక్షంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నట్లేనని అగ్రరాజ్యం వాదిస్తోంది. భారత్ ముడి చమురు కావాలి.. తమ వద్ద కొనుగోలు చేయండి.. అని అమెరికా చెబుతోంది. ఇదిలాఉంటే ఏషియన్ సమ్మిట్ లో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో మార్కో రూబియో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications