బస్ స్టాప్ పై మిసైల్ దాడి.. 33 మంది మృతి, 18 మందికి సీరియస్

రష్యా- ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని ప్రజా రవాణా లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపించింది. నిన్న రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. తాజాగా ఈస్టర్న్ ఉక్రెయిన్‌ లోని డొనెట్స్క్ రీజియన్ లోని క్రామటోస్క్ పట్టణంలోని బస్టాప్‌ పై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 30 మంది చనిపోగా మరో 18 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికార యంత్రాంగం వెల్లడించింది. బస్ స్టాప్ లో దాడులు జరిగిన వెంటనే ఉక్రెయిన్ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక క్రామటోస్క్ లోని బస్టాండ్ వద్ద మృతదేహాలు, శిథిలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ ఏడాదిలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ దాడిలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని జెలెన్‌ స్కీ హెచ్చరించారు.

" ప్రీలుకీలోని ఐదంతస్తుల భవనంపై రష్యా మిసైల్ దాడి అనంతరం చేపట్టిన సహాయక చర్యలు పూర్తయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే.. మృతుల సంఖ్య 22 కు చేరింది. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉండటం మరింత కలచివేస్తోంది. మృతుల కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక ఈ క్షిపణి దాడుల్లో ఏడుగురు చిన్నారులతోపాటు మొత్తం 50 మంది వరకూ గాయపడ్డారు. దాడులు జరిగిన వెంటనే దాదాపు 500 మంది వరకు సహాయక బృందాలు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నాయి. వారికి నా కృతజ్ఞతలు. అయితే రష్యా మన ప్రాంతంపై దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా క్రామటోస్క్ పట్టణంలోని పౌరులు ఉన్న బస్టాప్‌ పై రష్యా దాడులు చేసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పౌరులతో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. దీనికి ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటాం" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.

Russia attacks bus stop in the Kramatorsk Ukraine Donetsk region left 30 people dead 18 injured

ఇక ఈ ఘటనపై డొనెట్స్క్ రీజియన్ గవర్నర్ వాదిమ్ ఫిలాష్కిన్ మాట్లాడుతూ.. రష్యా కావాలనే ఉక్రెయిన్ లోని పౌరులపై దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. పౌరుల భద్రత దృష్ట్యా డొనెట్స్క్, స్లోవియాన్స్క్ ప్రాంతాలలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.డొనెట్స్క్ ప్రాంతంలోని కీలక నగరాలను కైవసం చేసుకునేందుకు రష్యా ఈ విధ్వంసకర వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. రష్యా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+