Comrade Kalyan First Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ఫస్ట్ రివ్యూ ఇదే..
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు చేస్తూ యూత్ లో ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9 న రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ ఫుల్ ఫన్ రైడ్ తో పాటు చివరలో ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ప్రకారం ఈ మూవీ ఫన్ తో పాటు నక్సలిజానికి సంబంధించిన అంశాలను కూడా తెరపై చూపట్టే ప్రయత్నం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు.
కామ్రేడ్ కళ్యాణ్ మూవీలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్ గా మహిమా నంబియార్ అనే హీరోయిన్ నటించింది. అలాగే ఈ మూవీలో సీనియర్ నటి రాధిక, టామ్ చాకో, వెన్నెల కిషోర్, ఉపేంద్ర, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కామ్రేడ్ కళ్యాణ్ మూవీకి కోనా వెంకట్ సమర్పకుడిగా ఉన్నారు. అలాగే స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇక అక్టోబర్ 9 న విడుదల కావాల్సిన త్రివిక్రమ్- వెంకటేశ్ ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా పడిన నేపథ్యంలో కామ్రేడ్ కళ్యాణ్ మూవీకి లైన్ క్లియర్ అయింది.ఈ క్రమంలో శ్రీవిష్ణు మూవీకి మంచి రిలీజ్ డేట్ దొరికింది.

ఇక కామ్రేడ్ కళ్యాణ్ మూవీకి సంబందించిన ప్రివ్యూ షో ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు. ఈ షో కు మీడియా ప్రతినిధులతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కూడా వచ్చినట్లు సమాచారం. వాళ్ల నుంచి వచ్చిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ 1992 నాటి ఆంధ్రా- ఒడిషా బోర్డర్ లో జరుగుతుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు ఓ థియేటర్ ఓనర్ గా కనిపించనున్నాడు. అతని తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక నటిస్తున్నారు. ఇక ఒడిషా అమ్మాయితో శ్రీవిష్ణు ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఫన్ మోడ్ లో సాగే ఈ మూవీలో నక్సలిజం పాత్ర ఏంటి..? అనేదే స్టోరీ. మొత్తానికి కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ఫస్టాఫ్ మొత్తం శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయిందని.. సెకండాఫ్ ఫన్ తో పాటు మంచి సెంటిమెంట్ తో కూడిన సందేశం కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమా పూర్తి రివ్యూ కోసం రేపటి వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications
