కుప్పకూలిన మిలిటరీ విమానం.. 17 మంది మృతి.. వీడియో వైరల్
రష్యాలోని సైబీరియాలో ఓ మిలిటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. సైబీరియాలోని కొమెరోవో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం రష్యా స్థానిక మీడియా ధృవీకరించింది. ఇజ్ వెస్టియా డైలీ అనే మీడియా కథనం ప్రకారం.. సైనిక విమానంలోని మొత్తం 17 మంది మృతి చెందారు. ప్రాథమికంగా ఈ విమానాన్ని ఏఎన్-12 మిలిటరీ విమానంగా గుర్తించారు.

కొమెరోవో ప్రాంతంలోని యగునోవో అనే గ్రామంలో ఈ విమానం కుప్పకూలిపోయినట్లు వెల్లడించింది. ఇక ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి విమానం అదుపుతప్పి భూమిని బలంగా ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో అందరూ కాలిబూడిదైనట్లు సమాచారం. ఇక ఈ విమానం కిందపడిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
All 17 aboard were killed in the crash of a Russian Air Force AN-12 today in Kemerovo. Reports and video appear to show the aircraft was on fire before the impact. https://t.co/uzC7kx6qXE
— Francisco Cunha - ✈️ Aviation et al (@OnDisasters) November 17, 2026
మరోవైపు ఈ ఘటనపై కొమెరోవో గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ టెలిగ్రామ్ లో మాట్లాడారు. ఇది వైమానిక ప్రమాదంగా అభివర్ణించారు. ఈ ప్రమాదం యగునోవో ప్రాంతంలో జరిగిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే తాను అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడ అత్యవసర సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరిపిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications
