వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయనీయంగా రష్యా-డిస్కౌంట్ లో చమురు అమ్మకాలు-అష్టదిగ్బంధనం ఫలితం

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాకు మూడు వారాలు గడుస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం లభించలేదు. యుద్ధం పేరుతో ప్రారంభించిన అరాచకాన్ని సమర్ధించుకోలేక, అలాగని వెనక్కి తగ్గలేక అక్కడ ఇరుక్కుపోయిన రష్యాకు ఇప్పుడు ఎటు చూసినా షాకులే. ముఖ్యంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన రష్యా ఇప్పుడు ఆంక్షల కారణంగా చౌకధరలకు చమురు అమ్ముకోవాల్సిన దుస్ధితి ఏర్పడింది.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర

ఉక్రెయిన్ పై తమ దేశం భద్రత పేరుతో రష్యా ప్రారంభించిన దండయాత్ర మొదలై మూడు వారాలు గడిచిపోయాయి. అయినా ఇంకా ఉక్రెయిన్ పై పూర్తిగా పట్టు చిక్కలేదు. మరో పది రోజులకు సరిపడా మందుగుండు, సైనికులు మాత్రమే రష్యాకు మిగిలున్నారనే వార్తలు ఓవైవు వినిపిస్తుండగా.. మరోవైపు ప్రపంచదేశాలు విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కుదేలవుతోంది. ఇదే క్రమంలో తమ ఆర్ధిక వ్యవస్ధకు పట్టుగొమ్మ అయిన చమురు ఎగుమతులపై రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చమురును డిస్కౌంట్ కు ప్రపంచ దేశాలకు అమ్మాలని నిర్ణయించుకుంది.

 డిస్కౌంట్ లో రష్యా చమురు

డిస్కౌంట్ లో రష్యా చమురు

ఆర్థిక ఆంక్షల ద్వారా రష్యాను ఒంటరి చేయడానికి యూఎస్, యూకే సహా పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. దీంతో తమ ఆర్ధిక వ్యవస్ధకు కీలకమైన చమురును డిస్కౌంట్ లో సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది.దీంతో ప్రపంచ చేశాలకు చౌకగా చమరు లభిస్తుండగా.. రష్యాకు ఆ మేరకు ఊరట లభిస్తోంది.

డిస్కౌంట్ ఎందుకంటే?

డిస్కౌంట్ ఎందుకంటే?

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు పాశ్చాత్య దేశాలు చమురు దిగుమతులపై ఆంక్షలకు ఇష్టపడలేదు. రష్యా నుంచి ఎగుమతుల్ని అడ్డుకుంటే అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడుతుందని ఆలోచించాయి. కానీ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగించేందుకే రష్యా మొగ్గుచూపడంతో రష్యా చమురు దిగుమతులపై ఆంక్షల విధింపు ప్రారంభమైంది. యుద్ధ పిపాసి రష్యా నుంచి చమురు, గ్యాస్ తీసుకోవడం తగ్గించుకోవాలని బ్రిటన్ నిర్ణయించగా.. యూఎస్ కూడా అదే నిర్ణయం తీసుకుంది.

కానీ ఈ రెండు దేశాల కంటే యూరప్ దేశాలు దిగుమతులు ఆపేయడంతో రష్యాకు చుక్కలు కనిపించడం మొదలైంది. ఆంక్షల కారణంగా పలు దేశాలు రష్యా చమురు తీసుకోవడం మానేశాయి. దీంతో డిస్కౌంట్ లో ఇచ్చేందుకు రష్యా ముందుకొస్తోంది. తద్వారా ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 భారత్, రష్యాలకు యూఎస్ ఊరట

భారత్, రష్యాలకు యూఎస్ ఊరట

అసలే భారత్ లో చమురు ధరలు మండిపోతున్నాయి. భారత్ లో చమురు అవసరాల కోసం 80 శాతం దిగుమతి చేసుకుంటున్న పరిస్ధితుల్లో ఇప్పుడు రష్యా నుంచి డిస్కౌంట్ పై వచ్చే చమురు తీసుకుంటే ఆ మేరకు చమురు బిల్లు తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. దీంతో రష్యా డిస్కౌంట్ చమురు తీసుకునేందుకు రెడీ అంటోంది. దీనికి యూఎస్ కూడా అభ్యంతరం పెట్టడం లేదు. రష్యా నుంచి భారత్ చమురు తీసుకోవడం ఆంక్షల ఉల్లంఘన కాబోదని అమెరికా ప్రకటించింది. దీంతో భారత్ తో పాటు రష్యాకూ ఆ మేరకు ఊరట దక్కబోతోంది.

English summary
russia is now selling its oil at discounted price to world countries amid sanctions with war on ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X