• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుండెకు చిల్లు ప‌డిందా? గ్లూ తో పూడ్చేస్తారు: 20 సెకెన్లు చాలు!

|

బీజింగ్‌: ఇంట్లో స్టీలు బిందెకు చిన్న రంధ్రం ప‌డింద‌నుకోండి. ఏం చేస్తారు? వెల్డింగ్ షాపువాడి ద‌గ్గ‌రికి వెళ్తారు. టింక‌రింగ్ చేయిస్తారు. అదే మ‌న గుండెకు చిల్లు ప‌డితే.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ప‌రుగెడ‌తారు. స‌ద‌రు డాక్ట‌ర్‌.. గుండెను చీల్చి చెండాడేస్తాడు. శ‌స్త్ర చికిత్స‌లంటూ హ‌డావుడి పెట్టి ల‌క్ష‌ల రూపాయ‌లు గుంజేస్తారు. ఇప్పుడా అవ‌స‌రం రాదు. ఎందుకంటే- స్టీలు బిందుకు ప‌డిన రంధ్రాన్ని పూడ్చటానికి టింక‌రింగ్ చేసిన విధంగా- గుండెకు ప‌డ్డ చిల్లును కూడా పూడ్చేయ‌డానికి శాస్త్ర‌వేత్త‌లు ఓ స‌రికొత్త ప‌దార్థాన్ని అభివృద్ధి చేశారు. అదే బ‌యో గ్లూ. గుండెకు రంధ్రం ప‌డ్డ‌ప్పుడు మాత్ర‌మే కాదు.. ఏదైనా ప్ర‌మాదంలో శ‌రీరానికి త‌గిలిన గాయాల‌ను కూడా అదే విధంగా క‌ప్పెట్టేయొచ్చు.

చైనాలోని జెఝియాంగ్ యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ ర‌క‌మైన బ‌యో-గ్లూను రూపొందించారు. ఏదైనా ప్ర‌మాదంలో దెబ్బ‌లు త‌గిలి ర‌క్తం ధార‌గా కారుతుంటే.. దాన్ని నియంత్రించ‌డానికి డాక్ట‌ర్లు క‌ట్టు క‌డ‌తారు. బ్యాండేజీ వేస్తారు. దానికి ఇకపై ఆ అవ‌స‌రం రాద‌ని, ఈ గ్లూతో మేనేజ్ చేసేయ‌వ‌చ్చని చెబుతున్నారు జెఝియాంగ్ శాస్త్ర‌వేత్త‌లు. దెబ్బ‌లు త‌గిలిన చోట గ్లూను పూస్తే- ర‌క్తం కార‌డాన్ని నిలిపివేయ‌వ‌చ్చు. దీనికి ప‌ట్టే స‌మ‌యం కేవ‌లం 20 సెకెన్లే. చూడ‌టానికి జెల్ లా క‌నిపించే ఈ బ‌యో గ్లూను ర‌క్తం కారుతున్న చోట పూసి, అల్ట్రా వ‌యోలెట్ కిర‌ణాల‌ను ప్ర‌సారం చేస్తే- గ్లూ గాయానికి అతుక్కు పోతుంది.

 Scientists create light-activated bio-glue that can instantly repair a broken heart

మొదట ఈ బ‌యో గ్లూను పంది కాలేయంపై ప్ర‌యోగించారు. అది మంచి ఫలితం ఇచ్చింది. జిలెటిన్, కొన్ని ర‌కాల ర‌సాయ‌నాలు, నీటి మిశ్ర‌మంతో దీన్ని త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. గాయం ఉన్న చోట చిన్న ఇంజెక్షన్ లా ఇస్తే సరిపోతుందట. గాయాలకు కుట్లు వేయాల్సిన అవసరం అసలే ఉండదంటున్నారు. సైనిక అవ‌స‌రాల కోసం దీన్ని తొలిద‌శ‌లో వినియోగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. క్ర‌మంగా దీన్ని సాధార‌ణ అవ‌సరాల కోసం అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెబుతున్నారు.

 Scientists create light-activated bio-glue that can instantly repair a broken heart

ర‌క్తం కారుతున్న చోట ఈ గ్లూను చుక్క‌లుగా పోసి, అల్ట్రా వయొలెట్ కిరణాలను ప్ర‌స‌రింప‌జేసిన‌ప్పుడు ఈ గ్లూ చ‌ర్మానికి అతుక్కు పోతుంద‌ని ప‌రీక్ష‌లో తేలింది. క్ర‌మంగా ఇది శరీర కణజాలంలోకి ప్రవేశిస్తుంద‌ని, 20 సెకెన్ల వ్య‌వ‌ధిలో రక్తం కారడాన్ని ఆపుతుందని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గుండెకు శ‌స్త్ర చికిత్స చేసే స‌మ‌యంలో రోగులు బ్లీడింగ్ తో మృతి చెందకుండా చూసేందుకు ఈ గ్లూ ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అంటున్నారు.

English summary
A light activated bio-glue could repair a broken heart after surgery or trauma, reducing uncontrolled bleeding after surgery, which is currently a major cause of death. Sealing heart and artery wounds is difficult because the adhesive must be strong enough to resist high blood pressure and the movement of a beating heart. Very few non-toxic materials meet these criteria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more