వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం టాయ్‌లెట్‌లో దొరికిందేంటి...? ఆ విమానం టేకాఫ్ ఎందుకు ఆలస్యమైంది..?

|
Google Oneindia TeluguNews

డర్బన్ : డర్బన్ నుంచి జోహాన్నెస్ బర్గ్‌కు బయలుదేరాల్సి ఉన్న సౌతాఫ్రికా ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి ఆలస్యంగా బయలుదేరింది. ఈ విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణం తెలిస్తే షాక్‌కు గురవుతారు. విమానం బయలుదేరే ముందర అందులోని టాయ్‌లెట్‌ను క్లీన్ చేస్తుండగా సిబ్బంది ఒక పిండం అడ్డుబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరికాసేపట్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందనంగా ఈ ఘటన జరిగింది. దీంతో విమానంలోని ప్రయాణికులను కిందకు దింపారు. వారి అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు. అయితే పిండం అక్కడికి ఎలా వచ్చిందనేదానిపై విచారణ చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విమానం మొత్తాన్ని తనిఖీ చేశారు. విమానం టేకాఫ్ తీసుకునే ముందు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని అందులో భాగంగానే టాయ్‌లెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పిండం కనిపించిందని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తప్పని పరిస్థితుల్లో విమానం ఆలస్యంగా బయలదేరాల్సి వస్తోందంటూ ప్రకటనలో పేర్కొంది.

Recommended Video

మరుగుదొడ్డిలో తాచు పాము.. భయాందోళనలో ప్రజలు
South Africa Flight delayed,Abandoned Foetus dicovered in flights toilet

ప్రయాణికులను దింపి వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఫ్లై సఫారీ విమానాయాన సంస్థ. ప్రయాణికులు ఎంతో సహనంతో తమకు సహకరించినందుకు విమానాయాన సంస్థ ధన్యవాదాలు తెలిపింది. దర్యాప్తు అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని ఫ్లై సఫారీ విమానాయాన సంస్థ తెలిపింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరో ప్రయాణికురాలు ఈ పనిచేసి ఉంటుందని భావిస్తున్నారు. కడుపులో పిండాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. ఎవరికొచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రయాణికులను మరో విమానంలో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చింది ఫ్లై సఫారీ విమానాయాన సంస్థ.

English summary
An abandoned foetus was found on board FlySafair aircraft FA 411, which was scheduled to depart from Durban on Friday morning at 6:15 to Johanessburg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X