వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్ల జాతీయుడిపై తెల్ల పోలీసు కాల్పులు: వీడియోతో మర్డర్ కేసు నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సౌత్ కరోలినా: అమెరికాలోని సౌత్ కరోలినాలో జాత్యహంకార ఘటన జరిగింది. నల్లజాతికి చెందిన ఓ వ్యక్తిపై తెల్లజాతి పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. దీంతో నల్లజాతీయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది.

వాల్టర్ లామర్ స్కాట్‌‌కు చెందిన కారు వెనుక భాగంలో లైట్ పలిగి ఉండటంతో పోలీసు పోలీస్ ఆఫీసర్ మైఖెల్ స్లాగర్ కారుని ఆపాల్సిందిగా కోరాడు. దీంతో వీరిద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వీడియోలో చూపిన దాని ప్రకారం స్కాట్‌‌ పరుగెత్తుతుండగా, స్లాగర్ అతనిపై కాల్పులు జరిపినట్లు వీడియోలో తెలుస్తోంది.

ఈ దృష్యాలను అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో సదరు పోలీస్ ఆఫీసర్ మైఖెల్ స్లాగర్ సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఉన్నాతాధికారులు అతనిహై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తిని వాల్టర్ లామర్ స్కాట్‌గా గుర్తించారు.

 murder

ఇటీవల కాలంలో అమెరికాలో నల్లజాతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ముఖ్యంగా తెల్లజాతి పోలీసులు నల్లజాతీయులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్కాట్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడుతూ "వీడియో మూలంగా ఏం జరిగిందో మనకు తెలిసింది. కాబట్టి మాకు సరైన న్యాయం చేయాల్సిందే" అని డిమాండ్ చేశారు.

ఈ ఘటన జాత్యహంకార దాడిలో భాగంగా జరిగేందేనని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్టాక్ కుటుంబానికి చెందిన లాయర్ క్రిస్ స్టివార్ట్ వీడియో తీసిన వ్యక్తిని హీరోగా అభివర్ణించాడు.

English summary
A white South Carolina police officer has been charged with murder after video emerged of him shooting a black man running away from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X