వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ని లేపేయమన్న ట్రంప్? లాడెన్ ను మట్టుబెట్టిన 'సీల్ టీమ్-6' బృందానికి ఆదేశం?

అమెరికాకు పక్కలో బల్లెంలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేపేయమన్నారా? ఇందుకు గతంలో ఒసామా బిన్ లాడెన్ ను తుదముట్టించిన అమెరికా నౌకాదళానికి చెందిన ‘స

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను పథకం ప్రకారం హతమార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నట్లు ఉత్తర కొరియా మీడియా ఆరోపిస్తోంది.

కిమ్ జాంగ్ ఉన్ ను లేపేయమంటూ గతంలో అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన 'సీల్ టీమ్-6'ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రహస్యంగా దక్షిణ కొరియాకు పంపినట్లుగా ఆ మీడియా పేర్కొంటోంది.

లిబియాను ఆక్రమించుకున్నట్లుగా.. ఇప్పుడు తమ దేశాధ్యక్షుడిని మట్టుబెట్టడం ద్వారా ఉత్తర కొరియాను కూడా ఆక్రమించుకోవాలని ట్రంప్ చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం ఆయన దక్షిణ కొరియాకు పంపిన సైన్యమేనంటూ ఆరోపిస్తోంది.

South Korean Media Report U.S. Navy Seal Squad Training to Kill Kim Jong-un

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 17 వేల సైనిక దళాలను పంపడమే కాకుండా, లాడెన్ ను మట్టుబెట్టిన స్పెషల్ టీం ను కూడా దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి చేర్చడం వెనక ఉన్న కారణం అదేనంటూ ఉత్తరకొరియా మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అయితే ఈ ఆరోపణలను అమెరికా నౌకాదళ కమాండర్ గేరీ రోజ్ తోసిపుచ్చారు. మిలిటరీ డ్రిల్ కోసమే తాము దక్షిణ కొరియాకు ఈ సైన్యాన్ని తరలించామని, వివిధ రకాల సైనిక విన్యాసాలు చేయాల్సి ఉండడం వల్ల అంత సైన్యం వస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఉత్తర కొరియాను తాను అదుపులో పెట్టి తీరుతామని, ఇందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్యన పేర్కొనడం కూడా ఉత్తర కొరియా మీడియా ఆరోపణలకు ఊతమిచ్చింది.

English summary
The same U.S. Navy seal squad that killed al-Qaeda founder Osama bin Laden is reportedly training to assassinate the North Korean dictator Kim Jong-un amid rising tensions in the region. Local media reports claim that Seal Team 6, the team which killed bin Laden in May 2011, have been deployed to South Korea where they are participating in the Foal Eagle and Key Resolve exercise taking place in the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X