పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 8.0 నమోదు
పెరూ : ఉత్తర మధ్య పెరూలో అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు భూకంపం వచ్చింది. ఆ మేరకు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ వివరాలు వెల్లడించింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అలర్టయ్యారు.
భూకంపానికి సంబంధించి పెరూ ప్రభుత్వం కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. తొలుత రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని పేర్కొంది. కల్లావు, లిమా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదమైతే లేదని వివరించారు అధికారులు.

పెరూలో సంభవించిన భూకంపానికి సంబంధించి అక్కడి సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. రెండు, మూడు నిమిషాల పాటు భూప్రకంపనలు రావడంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశామని పేర్కొంటున్నారు. ఆగ్నేయ ల్యాగునాస్‌కు కేవలం 80 కిలోమీటర్ల పరిధిలో, అలాగే యురిమ్యాగాస్ సిటీకి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. డెప్త్ పరంగా 114 కిలోమీటర్ల లోతుగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications