"పాకిస్థాన్ ను ఏరిపారేద్దాం.." భారత్- ఇజ్రాయెల్ జాయింట్ స్టేట్ మెంట్..!
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్.. భారత్ ను ఆకాశానికి ఎత్తారు. భారత్ గ్లోబల్ సూపర్ పవర్ అని అభివర్ణించారు. భారత్- ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉన్నాయని తెలిపారు. డిఫెన్స్ , ఇన్నోవేషన్ రంగాల నుంచి కౌంటర్ టెర్రరిజం, వ్యాపారం రంగాల వరకూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు రక్షణ రంగంలో కీలక ఒప్పందం చేసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోనే సర్.. భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ గ్లోబల్ సూపర్ పవర్ అని ప్రశంసించారు. ఇజ్రాయెల్- భారత్ మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. రక్షణ, కౌంటర్ టెర్రరిజం రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని వివరించారు. హమాస్ దాడుల సమయంలో భారత్ అందించిన మద్దతు తాము ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. గాజా శాంతి విధానంలో భారత్ పాత్ర మెచ్చుకోదగినదని వివరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోనే సర్ తెలిపారు.
భారత పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోనే సర్.. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. " మేము క్రమంగా అభివృద్ధి చెందుతున్నాం. భారత్ స్నేహానికి రుణపడి ఉంటాం. డిఫెన్స్, అగ్రికల్చర్, ఎకానమీ రంగాల్లో భారత్ కలిసి ముందుకెళ్తాం. అక్టోబర్ 7 న హమాస్ మాపై దాడి చేసినప్పుడు వెంటనే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆ విషయాన్ని మేము మర్చిపోలేదు. టెర్రరిజం ప్రతి చోటా ఉంది. ఉగ్రవాదంతో భారత్, ఇజ్రాయెల్ ఇబ్బందులు పడింది. మేము డిఫెన్స్ , ఇంటెలిజెన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాం" అని విదేశాంగ మంత్రి గిడియోనే సర్ తెలిపారు.
యుద్ధం కారణంగా ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్(IMEC) కారిడార్ ఆగిపోయింది. త్వరలోనే ఈ కారిడార్ ను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. భారత్- ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించాల్సిన సమయం వచ్చిందన్నారు. తద్వారా ఇరు దేశాల మధ్య టూరిజం, ట్రేడ్ పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన భారతీయ కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుందని వివరించారు.

మరోవైపు త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు సమావేశం కానున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోనే సర్ ధృవీకరించారు. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో ఇజ్రాయెల్ పాల్గొబోతుందని హింట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications