భారత్ కు గుడ్ న్యూస్- తాలిబన్ల స్నేహహస్తం- వేరే దేశంపై దాడులకు అనుమతివ్వబోమని ప్రకటన

ఆప్ఘనిస్తాన్ లో తాజా సంక్షోభం నేపథ్యంలో అధికార పగ్గాలు చేపట్టబోతున్న తాలిబన్లు.. భారత్ విషయంలో, తమ దేశంలో చిక్కుకున్న భారత పౌరుల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారని ప్రపంచదేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. ఉపఖండంలోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో గతంలో భారీగా పెట్టుబడులు పెట్టిన భారత్.. ఇప్పుడు ఏం చేయబోతున్నది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇలాంటి సమయంలో తాలిబన్ల ప్రతినిధి ఒకరు పాకిస్తాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

భారత్-ఆప్ఘన్ సంబంధాలు

భారత్-ఆప్ఘన్ సంబంధాలు

కొన్ని ధశాబ్దాలుగా భారత ఉపఖండంలోని దేశాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో భారత్ కు ఆప్ఘనిస్తాన్ తో చాలా అవసరం ఏర్పడింది. పాకిస్తాన్, చైనాలకు మధ్య నున్న ఈ దేశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగితే ఇరు దేశాలను కట్టడి చేయవచ్చన్న ఆలోచనతో భారత్ నిర్ణయాలు తీసుకుంది. తమ దేశం ఇబ్బందుల్ని కూడా లెక్కచేయకుండా ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంటు నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కోసం వేలాది కోట్లు ఖర్చుపెట్టేసింది. ఓవైపు పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ప్రజా ప్రభుత్వం ఉండటంతో భారత్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ తాజాగా పరిస్దితులు మారిపోయాయి.

తాలిబన్లతో భారత్ వైరం

తాలిబన్లతో భారత్ వైరం

రెండు దశాబ్దాలుగా ఆప్గనిస్తాన్ లో అధికారం కోసం ఎదురుచూస్తున్న తాలిబన్లకు మతపరంగా, రాజకీయ పరంగా, ఇతరత్రా అంశాల్లోనూ వైరం కొనసాగుతోంది. సహజంగానే పాకిస్తాన్ తో పాటు తీవ్రవాద సంస్ధల మద్దతు తీసుకుంటున్న తాలిబన్లు ఆ మేరకు భారత్ ను దూరం పెడుతున్నాయి. దీంతో తాలిబన్లతో భారత్ వైరం కొనసాగుతోంది. ఆప్ఘన్ గడ్డపై తాలిబన్లకు భారతీయులు లక్ష్యంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా భారతీయుడైన రాయిటర్స్ జర్నలిస్టు దానిష్ సిద్ధిఖీని కూడా తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారు. ఇాలాంటి నేపథ్యంలో ఆఫ్ఘన్ లో మారిన పరిస్ధితులు భారత్ కు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి.

 భారత్ కు తాలిబన్ల స్నేహహస్తం

భారత్ కు తాలిబన్ల స్నేహహస్తం

ఇన్నాళ్లూ భారత్ తో వైరం నడిపిన తాలిబన్లు.. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్దితుల నేపథ్యంలో మన దేశానికి స్నేహహస్తం చాచారు. ఉపఖండంలోని కీలక దేశాల్లో ఒకటైన భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు చెందిన ఆరీ టీవీకి ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భారత్ సహా ఏ దేశానికీ తాము వ్యతిరేకం కాదన్నాడు. అంతే కాదు ఆప్ఘన్ ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తమ విధానాలు రూపొందించాలని కోరుకుంటున్నట్లు ముజాహిద్ వెల్లడించారు.

Recommended Video

    TamilNadu : 1160 కోట్లు నష్టం..కానీ మధ్యతరగతే ముఖ్యం | Petrol Price Reduced || Oneindia Telugu
    భారత్ పై దాడులకు అనుమతివ్వం

    భారత్ పై దాడులకు అనుమతివ్వం

    ఆప్ఘనిస్తాన్ గడ్డపై తాలిబన్ల రాకతో వారికి మద్దతుగా నిలుస్తున్న ఉగ్రవాద సంస్ధలు భారత్ తో పాటు ఇతర దేశాలపై దాడులకు దీన్ని తమ అడ్డాగా మార్చుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్.. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగానూ వాడుకునేందుకు అనుమతివ్వబోమని స్పష్టం చేశారు. తద్వారా ఆప్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాద సంస్ధలు భారత్ ను టార్గెట్ చేయవచ్చన్న ఊహాగానాలకు తాలిబన్టు చెక్ పెట్టినట్లయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+