పాకిస్థాన్ నదీ గర్భంలో అంతులేని బంగారం..? భారత్ కు పెద్ద షాకే..!

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని ఖైబర్ పంక్తున్ఖ్వా రాష్ట్రంలో ఇండస్ నదిపై నిర్మించిన టార్బేలా డ్యామ్ మట్టిలో దాదాపు 636 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బంగారం నిల్వలను గుర్తించారు. ఈ విషయాన్ని ఎయిర్ కరాచీ ఛైర్మన్ హనిఫ్ గోహార్, ఫెడరేషన్ ఆఫ్ పాకిస్థాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(FPCCI) మాజీ వైస్ ప్రెసిడెంట్ ధ్రువీకరించారు. కరాచీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

టార్బేలా డ్యామ్ అంచున డైవర్స్ సేకరించిన మట్టి శాంపిల్స్ ను లేబరేటరీలో పరీక్షించగా అందులో గోల్డ్ కంటెంట్ ఉన్నట్లు గుర్తించినట్లు గోహార్ పేర్కొన్నారు. ఫలితాలు చూస్తే డ్యామ్ సెడిమెంట్ లో బంగారు రేణువులు ఉన్నట్లు తెలిపారు. డ్యామ్ వాల్యూమ్ మొత్తం పరిగణలోకి తీసుకుని అంచనా వేస్తే బంగారం విలువ 636 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదే కానీ జరిగితే ఒకసారి పాకిస్థాన్ మొత్తం అప్పును చెల్లించొచ్చని భావించారు.

ఇదే విషయాన్ని తాము పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు తెలియజేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని గోహార్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన వాటర్ అండ్ పవర్ డెవలప్ మెంట్ అథారిటీకి సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. బంగారు నిల్వల తవ్వకాల ప్రాజెక్ట్ యాజమాన్య బాధ్యతను ఈ సంస్థ తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం తవ్వకాలకు ముందుకు రాకపోతే తమ కంపెనీ డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడులు పెడుతుందని గోహర్ స్పష్టం చేశారు.

తమ టీమ్ ఇప్పటికే బంగారు నిల్వలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ తవ్వకాల కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక హోలాండ్, ఆమ్ స్టర్ డ్యామ్, కెనడా నుంచి పార్ట్ నర్స్ ను ఏర్పరచుకుని సురక్షితంగా బంగారు నిల్వలను తవ్వేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇస్తే తక్షణమే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Tarbela s Trillion-Treasure 636B Gold Haul Unearthed in Pakistan s Hidden Depths

నదీ గర్భంలో ఉన్న బంగారాన్ని తీయాలంటే అధునాతన హైడ్రాలిక్ డ్రెడ్జింగ్ అండ్ మినరల్ సెపరేషన్ టెక్నిక్స్ అవసరం. అయితే నిపుణులు మాత్రం.. నదీ భూగర్భంలో, మట్టిలో బంగారు నిల్వలు బయటపడడం సహజమేనని చెబుతున్నారు. టార్బేలా డ్యామ్ లో బంగారు నిల్వలు నిజమే అయితే.. పాకిస్థాన్ చరిత్రలోనే అతి పెద్ద ఖనిజాల గుర్తింపు ప్రాంతంగా నమోదవుతుందని అన్నారు. బెలూచిస్తాన్ లోని రేఖో దిక్ కు ఇది పోటీగా ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+