జిహాదీల నుంచి తల్లి రక్షిస్తే.. కూతురిపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: ఓ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ పైటర్‌ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్లిన నెదర్లాండ్స్ టీనేజర్‌ని చాకచక్యంగా రక్షించుకుని వెనక్కి తెచ్చుకున్న ఆమె తల్లి శుక్రవారం కోర్టులో హాజరవడంతో దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం నెదర్లాండ్స్‌కు తన తల్లి మోనికోతో వచ్చిన 19 ఏళ్ల టీనేజర్ గురించి తెలిపిన వివరాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తన కూతరు అసలు పేరు స్టర్లినా. 9 నెలలు క్రితం ఐచాగా పేరు మార్చుకుని ఇంటర్ నెట్‌లో పరిచయమైన ఐఎస్ఐఎస్‌ను కలిసేందుకు సిరియాకు వెళ్లింది.
తాను ఇంటర్నెట్‌లో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉన్న జిహాదీ వ్యక్తిని పరిచయం చేసుకుంటే... సిరియా వెళ్లాక ఆమె తప్పనిసరి పరిస్ధితిలో ట్యూనీషియాకు చెందిన జిహాదీ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఐచా వివహం చేసుకున్న వ్యక్తి గతంలో డచ్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసేవాడు.

ఈ విషయాన్ని తల్లి మోనికోకు చెప్పి సహాయం చేయాలని కోరగా, ఆమె ధైర్యంగా నికాబ్ (బురఖా వంటిది) ధరించి సరిహద్దు దాటి సిరియాకు వెళ్ళింది. అంతే కాదు ఐఎస్ మిలిటెంట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న రఖా నగరానికి చేరుకొని తన కూతురిని ఏ విధంగా తిరిగి నెదర్లాండ్స్‌కు తెచ్చుకున్న విషయాన్ని చెప్పింది.
దీంతో దేశంలోకి రాగానే ఆమెపై దేశద్రోహం కింద కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనికొ మాత్రం తన కూతురు అమాయకురాలని, కోర్టు కేసుల నుంచి తప్పక బయటపడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
సుమారు 130 మంది డచ్ జిహాదీలు ఫైటింగ్ చేసేందుకు సిరియా వదిలినట్లు డచ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ ఫైటింగ్‌లో 30 మంది తిరిగి వెళ్లగా, 14 మంది మరణించినట్లు పేర్కొంది. ఈ జిహాదీలు అందరూ యూరప్‌లో టెర్రర్ దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపింది.












Click it and Unblock the Notifications