అఫ్గానిస్తాన్ నుంచి భారతీయులను తరలించే చర్యలు వేగవంతం, భారత్ చేరుకుంటున్న విమానాలు
అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు వేగం అందుకున్నాయి.
నిన్న రాత్రి ఒక విమానం దుశాంబే మీదుగా న్యూదిల్లీ చేరుకుంది. దోహా, కాబుల్ నుంచి కూడా రెండు విమానాలు భారత్ వస్తున్నాయి.
ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి సంబంధించి అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది.
https://twitter.com/IndEmbDoha/status/1429164928078917636
"135 మంది భారతీయులతో ఉన్న మొదటి బృందాన్ని కాబుల్ నుంచి దోహా చేర్చాం. ఈరోజు వారిని భారత్ పంపిస్తున్నాం. వారిని సురక్షితంగా తరలించేందుకు ఎంబసీ అధికారులు తగిన సహాయ సహకారాలు అందించారు" అని చెప్పింది.
మరోవైపు శనివారం అర్ధరాత్రి తజకిస్తాన్ నుంచి ఒక ఎయిర్ ఇండియా విమానం 87 మంది భారతీయులతో న్యూ దిల్లీ చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
https://twitter.com/MEAIndia/status/1429169267887329282
"అఫ్గానిస్తాన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నాం. ఎయిర్ ఇండియా 1956 విమానం భారతీయులను తజకిస్తాన్ నుంచి న్యూ దిల్లీ తీసుకొచ్చింది. ఇద్దరు నేపాల్ పౌరులను కూడా తరలించాం. దుశాంబేలో మన రాయబార కార్యాలయం సాయం చేసింది. మరిన్ని విమానాలు రాబోతున్నాయి" అని చెప్పారు.
https://twitter.com/MEAIndia/status/1429264740505640960
భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కాబుల్ నుంచి మరో 168 మందిని తీసుకుని దిల్లీ వస్తోందని, వారిలో 107 మంది భారత పౌరులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్‌పోర్ట్ దారిలో భారతీయులు ఎక్కడ చిక్కుకున్నారు?
కాబుల్ విమానాశ్రయంపై ఐఎస్ దాడి చేసే చేయొచ్చంటూ అమెరికా హెచ్చరికలు
కాబుల్ విమానాశ్రయంపై అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. దీంతో అమెరికా పౌరులు ఎవరూ కాబుల్ విమానాశ్రయం వైపు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
బయట ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా అమెరికా పౌరులు తమను తాము కాపాడుకోవాలని శనివారం అమెరికా రక్షణ శాఖ జారీ చేసిన భద్రతా హెచ్చరికలో చెప్పారు.
కాబుల్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని, వేరే మార్గాలు అన్వేషిస్తున్నామని కూడా అమెరికా భద్రతా అధికారులు చెప్పారు.
ఐఎస్ దాడులు చేయవచ్చని హెచ్చరించిన అమెరికా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం షేర్ చేయలేదు. కాబుల్ మీద దాడి చేస్తామని ఐఎస్ కూడా ఎలాంటి బహిరంగ హెచ్చరికలూ చేయలేదు.
- అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడంపై ఇస్లామిక్ స్టేట్ ఏమంది?
- అఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్ ఏమన్నారు.. వాస్తవాలేమిటి

ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బయట గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండడంతో అమెరికా శనివారం ఈ సూచనలు జారీ చేసింది.
కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇప్పటివరకు 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారిలో 2500 మంది అమెరికా పౌరులు కూడా ఉన్నారని శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సులో అమెరికా రక్షణ శాఖ చెప్పింది.
ప్రస్తుతం కాబుల్ ఎయిర్ పోర్ట్ నియంత్రణ అమెరికా భద్రతా బలగాల చేతుల్లో ఉంది.
అమెరికా, అఫ్గానిస్తాన్ ప్రజల్లో కొంతమంది హింసకు గురయ్యారు. ఎయిర్ పోర్టు వైపు వస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో వారిపై దాడులు జరిగాయి అని అధికారులు చెప్పారు.
ఎయిర్ పోర్ట్ గేటు బయట జనం భారీగా గుమిగూడకుండా చూడాలని కూడా తమకు ఆదేశాలు అందాయని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం
- 'వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- అఫ్గానిస్తాన్: తాలిబన్ల వశమైన ఐదు ప్రాంతీయ రాజధానులు
- అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications