వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వలింగ సంపర్కుల వివాహంపై సంచలన నిర్ణయం: పార్లమెంట్‌లో అలాంటి బిల్లు ఆమోదం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అబార్షన్లపై రాజ్యాంగపరమైన హక్కును అమెరికా అత్యున్నత న్యాయస్థానం తొలగించిన వేళ.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 1973లో రో వర్సెస్ వేడ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అమెరికాలో అబార్షన్లకు రాజ్యాంగ హక్కుగా ఉంటూ వస్తోన్నాయి. ఇప్పుడు ఈ హక్కును ఈ మధ్యే తొలగించింది యూఎస్ సుప్రీంకోర్టు. ఇకపై దీనికి రాజ్యంగ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది. రాజ్యంగపరమైన రక్షణలేవీ ఉండబోవని స్పష్టం చేసింది.

హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో..

హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో..

దీనివల్ల ఎదురైన తీవ్ర వ్యతిరేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన రక్షణను కల్పిస్తామని ప్రకటించింది. దీనిపై ఆ దేశ పార్లమెంట్‌లో బిల్లును కూడా ఆమోదించింది. సమ లైంగికులు/స్వలింగ సంపర్కుల వివాహానికి రక్షణ కల్పించేలా రూపొందించిన బిల్లుకు యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ పచ్చజెండా ఊపింది.

రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్..

రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్..


రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును జో బైడెన్ ప్రభుత్వం రూపొందించింది. యూఎస్ హౌస్ రెప్రజెంటేటివ్స్‌లో 267-157 ఓట్ల తేడాతో ఇది ఆమోదం పొందింది. 47 మంది ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. మరో ఏడుమంది రిపబ్లికన్లు తటస్థంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇప్పుడీ బిల్లు సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. సెనెట్‌లో డెమొక్రాట్లకు 50 మంది సభ్యుల బలం ఉంది.

గే మెంబర్..

గే మెంబర్..

ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ బిల్లుకు రూపకల్పన చేసినట్లు డెమొక్రటిక్ సభ్యులు వెల్లడించారు. దీన్ని హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. 50 సంవత్సరాలుగా అబార్షన్లపై ఉన్న హక్కులను సుప్రీంకోర్టు తొలగించిన ప్రస్తుత పరిస్థితుల్లో- సమలైంగిక/స్వలింగ సంపర్కుల వివాహానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని డేవిడ్ సిసిల్లీన్ వ్యాఖ్యానించారు. డేవిడ్ సిసిల్లీన్ రోడ్ ఐలండ్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన స్వయంగా స్వలింగ సంపర్కుడు.

 ఆ డిమాండ్‌కు..

ఆ డిమాండ్‌కు..

సేమ్ సెక్స్, ఇంటర్‌రేసియల్ వివాహాలకు రక్షణ కల్పించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది అమెరికాలో. దీనిపై కొన్ని సందర్భాల్లో ర్యాలీలను కూడా నిర్వహించాయి ఎల్జీబీటీక్యూ అసోసియేషన్లు. అబార్షన్లపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎల్జీబీటీక్యూల్లో అభద్రతభావం ఏర్పడిందని, దీన్ని తొలగించేలా ఈ రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చామని డేవిడ్ సిసిల్లీన్ చెప్పారు. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

English summary
The US House passed a bill that would provide protection for same-sex and interracial marriage under federal law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X