బ్రహ్మపుత్ర నీరు రంగు మారడానికి భూకంపమే కారణం: చైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: బ్రహ్మపుత్ర నదీ నీళ్లు రంగు మారడానికి ఇటీవల టిబెట్‌లో 6.9 తీవ్రతతో భూకంపం రావడమే కారణం అని చైనా చెబుతోంది. సియాంగ్ నదీ జలాలు నలుపు రంగులోకి మారడం వెనుక చైనా కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.

నదీ జలాలు ఎక్కువగా కలుషితం కావడం వల్లే అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదీ జలాలు రంగు మరాయని కొన్ని మీడియా వర్గాలు చెప్పాయి. దీంతో చైనా స్పందించింది.

Tibet earthquake caused Brahmaputra's turbidity: China

నవంబరు నెలలో టిబెట్‌లో భూకంపం సంభవించిందని, ఆ సమయంలో చైనాలో బ్రహ్మపుత్ర నదిలోని నీరు నలుపు రంగులోకి మారిందని వెల్లడించారు.

ఎగువ ప్రాంతంలో చైనా సొరంగ మార్గం పనులు చేపట్టడం వల్లే నదీ జలాలు రంగు మారినట్లు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అధికారులు ఆరోపించారు. ఆ ఆరోపణలను చైనా గతంలోనే ఖండించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China today said a 6.9-magnitude earthquake in Tibet in mid-November had caused turbidity in the Brahmaputra waters, which had sparked concerns in India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి