వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరికీ శిక్ష విధించిన కిమ్: కారణమేంటి?.., ద.కొరియా ఆసక్తికర కథనం..

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఉత్తరకొరియా ప్రజలకు అక్కడి ప్రభుత్వం చెప్పేదే శిరోదార్యం. దాన్ని ధిక్కరించే సాహసం ఎవరూ చేయరు. కనీసం ఎక్కడా వ్యతిరేకించరు. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంతలా అక్కడి ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించేవారికి కూడా ఇక్కడ ఘోరమైన శిక్షలు అమలులో ఉంటాయి. ఒక వర్గం ప్రజలకు అత్యంత కఠినమైన శిక్షలు కూడా అమలువుతుంటాయి. వ్యక్తి చేసిన తప్పుకు కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అది అక్కడికే పరిమితమవదు, తర్వాతి తరం కూడా జైలు శిక్ష అనుభవించాల్సిందే.

లంచం తీసుకున్నారన్న కారణంగా ఇద్దరు ఉత్తరకొరియా అధికారులను కిమ్ జాంగ్ శిక్షించినట్లుగా ఇటీవల ఓ కథనం వెలుగులోకి వచ్చింది.

ఏంటీ 'బైనరీ ఫామ్'?: సోదరుడి హత్య వెనుక కిమ్ ప్లాన్ ఇదే.., ఊహకందని రీతిలో.. ఏంటీ 'బైనరీ ఫామ్'?: సోదరుడి హత్య వెనుక కిమ్ ప్లాన్ ఇదే.., ఊహకందని రీతిలో..

ఎవరా ఇద్దరు?:

ఎవరా ఇద్దరు?:

కిమ్ జాంగ్ ఉన్ వద్ద పనిచేసే అత్యంత సీనియర్ అధికారులిద్దరు లంచం ఆరోపణలు ఎదుర్కొన్నట్లు దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. ఆ ఇద్దరిలో ఒకరు ఉత్తరకొరియా పొలిట్ బ్యూరో డైరెక్టర్ హ్వాంగ్ ప్యోంగ్ కాగా.. మరొకరు అతని డిప్యూటీ అయిన వోంగ్ హాంగ్.

భయపెడుతున్న 'మిస్టరీ?': వాళ్లిద్దరూ ఏమయ్యారు?, కిమ్ మరో సీక్రెట్ ప్లాన్! భయపెడుతున్న 'మిస్టరీ?': వాళ్లిద్దరూ ఏమయ్యారు?, కిమ్ మరో సీక్రెట్ ప్లాన్!

అనూహ్యంగా అదృశ్యం:

అనూహ్యంగా అదృశ్యం:

లంచం ఆరోపణలు అధ్యక్షుడి దృష్టికి రావడంతో వారికి కఠిన శిక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో వోంగ్ హాంగ్ ను జైలుకు పంపించగా.. మరొకరికి ఎలాంటి శిక్ష విధించారో తెలియరాలేదు. ఈ ఇద్దరు గత కొంతకాలంగా అనూహ్యంగా అదృశ్యమైపోవడంతో వీరి మిస్టరీపై అక్కడ పెద్ద జరుగుతోంది. ఇలాంటి తరుణంలో.. వారిద్దరికీ శిక్షలు విధించారంటూ దక్షిణ కొరియా మీడియా కథనం వెలువరించింది.

 పార్టీ నుంచి బహిష్కరణ:

పార్టీ నుంచి బహిష్కరణ:


శిక్షకు ముందే హ్వాంగ్ పోంగ్ వర్కర్స్ పార్టీ నుంచి తొలగించబడ్డారు. అయితే ఈ ఉద్వాసనకు కారణాలేంటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఒకరకంగా అధ్యక్షుడి ఆదేశాలను ఉల్లంఘించడం లేదా అతని పట్ల విధేయతగా ఉండకపోవడం వల్లే వీరిద్దరికి శిక్షలు పడ్డాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో మామను శిక్షించాడు:

గతంలో మామను శిక్షించాడు:

గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సొంత మామ జాంగ్ సంగ్‌కి కూడా కిమ్ జాంగ్ మరణ శిక్ష విధించారు. కుక్కల బోనులోకి పంపించి అతన్ని హత్య చేయించారు. డ్రగ్స్, జూదం, మహిళలతో జల్సా, వంటి ఆరోపణలతో అన్ని పదవుల నుంచి అతన్ని తొలగించారు. అక్కడి మీడియా కూడా జాంగ్ సంగ్ ను 'కుక్క కంటే అధ్వాన్నమైనవాడు'గా అభివర్ణించింది. ఆ తర్వాత తన సోదరుడు కిమ్ జోంగ్ నామ్ ను సైతం కిమ్ జాంగ్ ఉన్ రసాయనిక దాడి ద్వారా హత్య చేయించారు. కౌలాలంపూర్ లో జరిగిన ఈ హత్య ప్రపంచాన్నే నివ్వెరిపరిచింది.

English summary
Two of Kim Jong Un's most senior officials have been punished for allegedly taking bribes, with one sent to a prison camp, according to South Korea media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X