వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ లో ట్రంప్, అప్పుడే బెదిరింపులు, అణుదాడి జరుగుతుందా? అందరిలోనూ ఆందోళన!

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ కు పరమవిరోధి దేశాలైన జపాన్, దక్షిణకొరియాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరగనుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అనుకున్నట్లుగానే జరుగుతోంది. అప్పుడే బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఉత్తరకొరియాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసియా పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. తన టూర్ లో భాగంగా ఆదివారమే ఆయన జపాన్ కు విచ్చేశారు.

అధికారం చేపట్టిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఆసియా ఖండంలోని కొన్ని దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జపాన్‌లో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఉత్తరకొరియా ఏలాంటి చర్యలకు పాల్పడుతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్పుడే బాంబు బెదిరింపులు...

అప్పుడే బాంబు బెదిరింపులు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి జపాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ కు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. షిగా ప్రాంతంలోని ఓ షిప్‌ కంపెనీకి ఈ రకమైన బెదిరింపులు వచ్చాయట. ఈ కంపెనీకి చెందిన సైట్‌ సీయింగ్‌ షిప్‌లో బాంబు పెట్టామని, మరో గంటలో పేలే అవకాశం ఉందని బెదిరించినట్లు జపాన్‌ మీడియా తెలిపింది. దీంతో అధికారులు ఆ షిప్ లోని 290 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. షిగా ప్రాంతంతో పాటు హిరోషిమా, ఒసాకా ప్రాంతాల్లోని డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయట. ట్రంప్‌ జపాన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం.

 ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు...

ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు...

అయితే ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ కు జపాన్, దక్షిణకొరియా శత్రుదేశాలు. ఉత్తరకొరియా క్షిపణుల పరిధిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరగనుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

 పరిస్థితి ప్రమాదకరమా?

పరిస్థితి ప్రమాదకరమా?

ట్రంప్ పర్యటనపై పలువురు నిపుణులు తీవ్రహెచ్చరిలు జారీ చేస్తున్నారు. వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ.. కిమ్ జాంగ్ ఉన్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, అణుబాంబుని ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా మిలిటరీ అధికారులు ఉత్తరకొరియాపై నిఘా పెంచారు.

అప్రమత్తంగా ఉండాలి...

అప్రమత్తంగా ఉండాలి...

ఇదే విషయాన్ని ఆసియా-పసిఫిక్ సెక్యూరిటీ ప్రొగ్రామ్ డైరెక్టర్ పాట్రిక్ క్రొనిన్ కూడా చెబుతున్నారు. ఉత్తరకొరియా చేయబోయే దాడికి అమెరికా సిద్ధంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితికైనా అమెరికా మిలిటరీ సంసిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.

అణుదాడి జరపకపోవచ్చుగానీ...

అణుదాడి జరపకపోవచ్చుగానీ...

మరో సీనియర్ అధికారి, ఫెడరేషన్ ఆఫ్ అమెరికా శాస్త్రవేత్త ఆడం మౌంట్ మరో వాదనను వినిపిస్తున్నారు. ట్రంప్ జపాన్, దక్షిణకొరియాలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా అణుదాడి జరపకపోవచ్చుగానీ, అమెరికాకి తన ధిక్కారాన్ని తెలియజేసే ఉద్దేశంతో మరో అణుపరీక్షను నిర్వహించే అవకాశం మాత్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గత్యంతరం లేదు.. సైనిక దాడే మార్గం...

గత్యంతరం లేదు.. సైనిక దాడే మార్గం...

ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. ఒకవేళ అమెరికాతో యుద్ధం చేయాల్సి వస్తే.. ఉత్తరకొరియా జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనకడదని పెంటగాన్ విశ్లేషించింది. ఈ మేరకు అమెరికా చట్ట సభ్యులకు ఒక లేఖ కూడా రాసింది.

అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌

అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌

ఏ నియంత కూడా అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. టోక్యోలోని యొకోటా ఎయిర్‌ బేస్‌లో ఆయన మాట్లాడుతూ...‘ఏ నియంత, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు..' అని వ్యాఖ్యానించారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌.. ఆ దేశ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు.

English summary
Japan was hit by a rare string of bomb threats as US President Donald Trump held talks in Tokyo, kicking off an Asia tour under heavy security, police said on Monday. In the western Shiga prefecture, a ferry company received a call from a man who “claimed to have set up a bomb inside a sightseeing ship that would explode in an hour,” a police spokesman told. White House officials and Asian leaders are worried that North Korea may provoke a crisis in an effort to throw President Donald Trump’s trip to the region off script.Their concern is that North Korea’s leader, Kim Jong Un, might conduct a ballistic missile test — or even a far more shocking atmospheric nuclear test — during Trump’s visit to Japan or South Korea, and that Trump would respond by escalating rather than defusing tensions. Trump has met Kim’s recent provocations with growing anger, including his August threat to unleash “fire and fury” against the North.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X