వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ పైలట్ విడుదల: గుడ్ న్యూస్ అందిందని ముందే చెప్పిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ నిర్బంధంలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ రేపు విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ గురువారం చెప్పాడు. అంతకుముందే అభినందన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి ప్రకటించారు. ఈ ప్రకటకు ముందే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్-కిస్తాన్ ఉద్రిక్తతలపై స్పందించారు.

భారత్‌, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగింపు దశకు వచ్చాయని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. గురువారం వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Trump says US has some reasonably decent news on reducing India-Pakistan tensions

భారత్‌, పాకిస్తాన్ పరిస్థితిపై విలేకర్లు ప్రశ్నించారు. భారత్‌, పాక్‌కు సంబంధించి ఓ మంచి వార్త తనకు అందిందని, ఇరుదేశాల మధ్య ఏర్పడిన సమస్యలు ముగింపు దశకు చేరుకున్నాయని భావిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే ట్రంప్‌ దగ్గరకు వచ్చిన ఆ మంచి వార్త ఏమిటనేది మాత్రం ఆయన బయట పెట్టేందుకు నిరాకరించారు.

ఆ తర్వాత కాసేపటికే ఇమ్రాన్ ఖాన్.. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

English summary
"They've been going at it, and we've been involved in trying to have them stop. And we have some reasonably decent news, hopefully that's going to be coming to an end," said Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X