ఇక వీసా రానట్లే భయ్యా.. భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. చైనాకు ఊరట అదేంటో..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే షాకులకు అటు ప్రపంచ దేశాలు, ఇటు వలసవాదులు అల్లకల్లోలం అవుతున్నాయి. గ్యాప్ ఇవ్వకుండా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అమెరికా వెళ్లాలన్న ప్రపంచ దేశాల యువతకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
అమెరికాలో హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. వారికి భారీ షాక్ ఇచ్చారు. EB-5 అన్ రిజర్వ్ డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని ఆరు నెలలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా దేశస్థులకు మాత్రం కటాఫ్ డేట్ మార్చలేదు అమెరికా యంత్రాంగం. కానీ భారతీయులకు మాత్రం 2019 నవంబరు 1 నుంచి 2019 మే 1కి కుదించింది. ఈ నిర్ణయంతో భారతీయులపైనే కక్ష కట్టినట్లుగా వ్యవహరించింది అమెరికా యంత్రాంగం.
ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో గ్రీన్ కార్డు లేదా హెచ్-1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి అది లభించే అవకాశం మరింత సన్నగిల్లనుంది. ఇటీవలే అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందేనని కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. ఈ రూల్ ప్రకారం.. యూఎస్ లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ హెచ్1 బీ వీసా దారులు అయితే హెచ్1 బీ వీసా, గ్రీన్ కార్డు సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితోపాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు కూడా వెంట పెట్టుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications