రాడికల్ ఇస్లామిజంతో మొత్తం ప్రపంచానికి పెను ముప్పు

ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 16 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చిచంపారు. ఘటనతో ఒక్కసారిగా సిడ్నీ ఉలిక్కిపడింది. హనుక్కా పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన చానుకా బై ది సీ అనే యూదుల కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. వైట్‌హౌస్‌లో హనుక్కా వేడుకలను ఆయన ప్రారంభించారు. రిపబ్లికన్లు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు ట్రంప్. బొండీ బీచ్ కాల్పుల ఉదంతాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు వ్యాఖ్యానించారు. ఇందులో 15 మంది మరణించారని, 25 మంది గాయపడ్డారని, వారికి తన సంతాపం, సానుభూతిని తెలియజేస్తోన్నానని అన్నారు.

Trump Speech on Radical Islamic at White House Hanukkah Event

రాడికల్ ఇస్లామిజం వల్ల ప్రపంచానికి పెను ముప్పు ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. యూదుల వ్యతిరేక ఉగ్రదాడి వల్ల ప్రభావితమైన ఆస్ట్రేలియన్లకు సంతాపం తెలియజేద్దామని సూచించారు. మౌనం పాటించారు. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తోన్నానని, గాయపడిన వాళ్లు వారికి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. యూదులకు ఎప్పటికీ అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు ట్రంప్. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకతాటిపై నిలబడాలని అన్నారు. పేర్కొన్నారు.

ఈ దాడికి పాల్పడిన ఇద్దరు షూటర్లు తండ్రీకొడుకులుగా గుర్తించారు. నవీద్ అక్రమ్, అతని కుమారుడు సాజిద్ అక్రమ్‌గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో నవీద్ అక్రమ్ సంఘటన స్థలంలోనే మరణించగా.. సాజిద్ అక్రమ్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+