viral video: అయ్యో ట్రంప్ నడవలేని పరిస్థితి.. చివరికి మోదీ సాయంతో..
ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోదీ- ట్రంప్ ఒకర్నొకరు ఆప్యాయంగా, ప్రేమతో పలకరించుకుంటూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ భుజంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శభాష్ అంటూ తట్టడం కనిపిస్తోంది. ఇక జీ 7 శిఖరాగ్ర సదస్సు ఫ్యామిలీ ఫోటో సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీ 7 దేశాధినేతలు అందరూ ఒకే చోట నిల్చుని ఫ్యామిలీ ఫోటో దిగేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే అదే సమయంలో ట్రంప్ నెమ్మదిగా తల దించుకుని స్టేజీ ముందుకు వస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా అధికారులు ముందు ఎత్తుగా స్టేజీ ఉందని గమనించి నెమ్మదిగా రావాలని ట్రంప్ కు సూచనలు చేశారు. అదే సమయంలో పక్కనే ప్రధాని మోదీ నిల్చుని ఉన్నారు. అయితే మెట్లు ఎక్కేందుకు ట్రంప్ ఇబ్బంది పడుతున్నట్లు ప్రధాని మోదీ గమనించారు. వెంటనే చేయి ఇచ్చి ట్రంప్ కు సాయం చేశారు. అలా ప్రధాని మోదీ సాయంతో ట్రంప్ స్టేజీ పైకి వచ్చి ఫ్యామిలీ ఫోటోకు సహకరించారు. దాంతో ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోనే భారత సంస్కృతి దాగి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
A warm diplomatic moment at the G7 Summit in Évian.
— India Today Global (@ITGGlobal) June 17, 2026
Prime Minister Narendra Modi was seen extending a helping hand to US President Donald Trump during the leaders' family photo session. The two leaders also shared multiple interactions throughout the day, highlighting the… pic.twitter.com/Bf6Z02ZRx4
ట్రంప్- మోదీ గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. అంటే దాదాపు మోదీ, ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత కలుసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు ఇరాన్ యుద్ధం, అంతకుముందు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్, మోదీ మధ్య భేటీ కీలకంగా మారింది. జీ 7 సదస్సులో ట్రంప్, మోదీ పక్కపక్కనే కూర్చొన్నారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ ఈ జీ 7 శిఖరాగ్ర సదస్సుకు నేతృత్వం వహిస్తున్నారు. సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మేక్రాన్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం, మోదీ జీ7 దేశాల నేతలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులను కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతన్నాయి.












Click it and Unblock the Notifications