ఎయిడ్స్ రోగులనూ వదలని ట్రంప్.. 63 లక్షల మందికి డెత్ రెడీ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పలు విప్లవాత్మక చర్యలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్నారు. కెనడా, ఫ్రాన్స్, చైనా దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించారు.

అంతేకాక గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ప్రకటన చేశారు. తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఏటా అమెరికా ఇచ్చే రూ. 3,83,160 కోట్ల సాయాన్ని నిలిపివేస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాక USAIDS సంస్థలోని స్టాఫ్ ను 10,000 నుంచి 300లకు తగ్గించింది ట్రంప్ సర్కార్.

Trump s Shocking Decision US Cuts 3 83 Lakh Crore Aid for AIDS Patients

ప్రపంచ దేశాల్లోని ఎయిడ్స్ రోగులకు తమ వంతు సాయం కింద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఫ్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్(PEPFAR) అనే విధానాన్ని అప్పటి అధ్యక్షుడు జార్జి.వీ. బుష్ స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ కొనసాగుతూ వస్తోంది.

400శాతం మరణాలు..

మరోవైపు అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులపై భారం తప్పదని తెలిపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మెడిసిన్ కొనే స్తోమత లేక 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ రోగులు మృతి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల సంఖ్య 400 శాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2023లో కేవలం 13 లక్షల కేసులు మాత్రమే నమోదు కాగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో 160 దేశాల్లో వచ్చిన సత్ఫలితాలు వృథా అవుతాయని పేర్కొంది.

అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా సౌతాఫ్రికా(14శాతం)లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మొజాంబిక్, నైజీరియా ఉన్నాయి. ఎయిడ్స్ రోగుల సంఖ్యలో భారత్ నాలుగో ప్లేస్ లో ఉంది. భారత్ తర్వాత రష్యా, టాంజానియా, ఉగాండా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+