కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్: సెంట్రల్ అమెరికాలోని కరీబియన్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6 నుంచి 7.8 వరకు నమోదయింది. దీని ప్రభావంతో వర్జిన్, ఫ్యూర్టోరికో దీవులలో సునామీ వచ్చే అవకాశముందని, మూడు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని అమెరికా భౌగోళిక సర్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భూప్రకంపనలు ధాటికి హోండ్యురాస్ రాజధాని టెగుచిగల్పాలో భవనాలు కుప్పకూలాయి. వృక్షాలు నేలకూలాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో అత్యవసర పరిస్థితిని విధించారు. మెక్సికోలోని క్వింటానా రూ ప్రాంతంలోనూ ప్రకంపలు సంభవించాయి.












Click it and Unblock the Notifications