ఎలాన్ మస్క్ ఎఫెక్ట్: ట్విట్టర్ ఉద్యోగులకు సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే క్షమాపణ
లండన్: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే ఆ సంస్థ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ప్రస్తుత యజమాని ఎలాన్ మస్క్.. కంపెనీ ఉద్యోగులను దాదాపు 50 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని డోర్సే తప్పుబట్టారు. సంస్థ ఉద్యోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
Folks at Twitter past and present are strong and resilient. They will always find a way no matter how difficult the moment. I realize many are angry with me. I own the responsibility for why everyone is in this situation: I grew the company size too quickly. I apologize for that.
— jack (@jack) November 5, 2022
ట్విట్టర్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రస్తుతం కొనాసగుతున్న వారు మానసికంగా దృఢంగా ఉంటారని, కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఓ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారని జాక్ డోర్సే అన్నారు. చాలా మంది ఉద్యోగులకు తనపై కోపంగా ఉందని తెలుసు.. వారు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత తనదేనని డోర్సే ట్విట్టర్ వేదికగా స్పస్టం చేశారు.

అతి తక్కువ సమయంలోనే కంపెనీ సామర్థ్యాన్ని పెంచడమే తాను చేసిన తప్పు అని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని డోర్సే తెలిపారు. కాగా, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే డోర్సే తన ఆవేదనను పంచుకున్నారు.
2006లో బోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. 2007 నుంచి డోర్సే కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2015లో ట్విట్టర్ సీఈవోగా నియమితులయ్యారు. 2021 నవంబర్ లో సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఇక మేలలో డైరెక్టర్ బాధ్యతల నుంచి కూడా డోర్సే తప్పుకున్నారు. ఆ తర్వాత ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది.












Click it and Unblock the Notifications