ఒకే పెళ్లికి ఇద్దరు పెళ్లికొడుకులు!: బట్టబయలైన పాక్ బండారం!!
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య గతేడాది మే నెలలో జరిగిన 4 రోజుల తీవ్ర సైనిక ఘర్షణను ఆపడంలో తామే కీలక పాత్ర పోషించామని చైనా చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విశేషమేమిటంటే నిన్నటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శాంతి దూత అని పొగిడిన పాకిస్థాన్.. ఇప్పుడు చైనా వాదనను కూడా సమర్థిస్తూ ప్లేటు ఫిరాయించింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల మాట్లాడుతూ.. గతేడాది భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తమ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందని.. దీనివల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని అన్నారు. దీనిపై పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ స్పందిస్తూ.. "మే 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఘర్షణ సమయంలో చైనా నాయకత్వం మాతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. భారత్‌తో కూడా చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించడంలో చైనా దౌత్యం కీలక పాత్ర పోషించింది" అని చైనా వాదనను బలపరిచారు.

ట్రంప్ వర్సెస్ చైనా.. పాక్ అయోమయం
అయితే ఇక్కడే పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి బయటపడింది. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ తాను టారిఫ్ బాంబులతో బెదిరించడం వల్లే భారత్-పాక్ యుద్ధం ఆగిందని దాదాపు 50 సార్లు చెప్పుకున్నారు. అప్పట్లో పాకిస్థాన్ కూడా ట్రంప్‌కు 'నోబెల్ శాంతి బహుమతి' ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు చైనా మేము ఆపాము అనగానే.. పాక్ వారు కూడా 'అవును' అంటూ వంత పాడుతోంది. ఒకే కాల్పుల విరమణకు ఇద్దరు 'క్రెడిట్' తీసుకుంటుంటే, పాకిస్థాన్ అందరికీ వంత పాడుతుండటం చూస్తుంటే, ఆ దేశానికి ఒక స్థిరమైన స్టాండ్ లేదని స్పష్టమవుతోంది.
భారత్ స్పష్టమైన వైఖరి
భారత్ మాత్రం మొదటి నుంచి ఒకటే మాటపై ఉంది. ఈ ఘర్షణలో ఏ మూడో దేశం జోక్యం లేదని.. పాకిస్థాన్ స్వయంగా చేసిన విజ్ఞప్తి మేరకు మాత్రమే కాల్పుల విరమణ జరిగిందని భారత్ స్పష్టం చేసింది. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విఫలమవడంతోనే వారు తోక ముడిచారని భారత దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
-
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు











Click it and Unblock the Notifications