తనపై రెండు సార్లు అత్యాచారం జరిగిందన్న నటి

Posted By:
Subscribe to Oneindia Telugu

లాస్ ఏంజిల్స్ :తనపై రెండు దఫాలు అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారాల మూలంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నా, కాని, ఈ తప్పులు నా వల్ల జరగలేదని బతికాను. జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నాని ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ ఇవాన్ రేచెల్ వుడ్స్ చెప్పారు.

సాధారణంగా సినిమా స్టార్లు, సెలబ్రిటీలు తమపై అత్యాచారాలు జరిగితే , అవమానాలకు గురైతే బయటకు చెప్పారని, అయినా ఈ విషయాలను ఆమె ధైర్యంగానే బయటపెట్టారు.జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. తాను పడ్డ కష్టాలను ఆమె రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కష్టాలను వెల్లడించారు.వెస్ట్ వరల్డ్ అనే సైన్స్ ఫిక్షన్ తో ఆమె ప్రఖ్యాతి చెందారు.

two rape attmept on me ,sensational statement hollywood actress

తనపై రెండు దఫాలు అత్యాచారం జరిగింది .ఈ విషయానికి తాను సిగ్గుపడబోనని చెప్పారు. సెక్సిజం, వివక్ష అనేది సమాజంలో కొనసాగుతోందని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాలను దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు ఆమె. చాలా క్లిష్టమైన సమస్యలతోనే బతికి ఉంటున్నట్టు చెప్పారు.గతంలో జరిగిన ఘటనలను మర్చిపోలేమని ఆమె గుర్తుచేశారు.

తనపై తొలిసారి తన బోయ్ ఫ్రెండ్ అత్యాచారం చేశాడని, రెండో సారి బార్ యజమాని రేప్ చేశాడని ఆమె చెప్పారు. రెండు దఫాలు తాను రేప్ కు గురయ్యాయని , ఈ సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు చెప్పారామె. అయితే ఈ విషయంలో తన తప్పులేదని భావించి బతికానని ఆమె తన గతాన్ని మరోసారి నెమరువేసుకొన్నారు.

తన ఇంటర్వ్యూ కు సంబందించిన ఆమె లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ఆమెకు చాల మంది మద్దతుగా నిలిచారు.ఆమె జీవితంలో పడిన కష్టాలను పలువురు ప్రశంసించారు. కొంతకాలంపాటు ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
boy friend first time, bar owner second rape on me said hollywood cine star, singer ivan rechelwoods.she give an interview a stone magazine ,west world science fixation fame this star.hollywood star post this social media, netizens support to star.
Please Wait while comments are loading...