ఆపరేషన్ ఉత్తర కొరియా: అమెరికా-దక్షిణ కొరియా భారీ వైమానిక విన్యాసాలు
సియోల్: అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాలు సోమవారం సంయుక్తంగా భారీ వైమానిక విన్యాసాలు ప్రారంభించాయి.
అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి ప్రయోగంతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఉత్తర కొరియా చర్యకు దీటుగా బదులిచ్చేందుకు అమెరికా ఈ రకంగా సిద్ధమైంది.
Recommended Video

దక్షిణ కొరియాతో కలిసి సోమవారం భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. క్రితం చేపట్టిన వైమానిక విన్యాసాల కంటే ఇది చాలా పెద్దది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ఉత్తర కొరియా పేరుతో ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ఐదు రోజుల పాటు విన్యాసాలు
ఐదు రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో 230 ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొంటున్నాయి. వీటిలో ఎఫ్ 22 రాప్టర్ స్టీల్త్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఇరు దేశాలకు చెందిన వేల సంఖ్యలో వైమానిక సిబ్బంది కూడా డ్రిల్‌లో పాల్గొననున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది.

ఇటీవలే ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
రెండు నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర కొరియా క్రితం వారం శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. హ్వాసంగ్ 15 పేరుతో విజయవంతంగా ప్రయోగించిన ఈ క్షిపణి వాషింగ్టన్‌ను చేరుకోగలదని ఆ దేశం ప్రకటించింది.

దేశాల మధ్య మాటల యుద్ధం
ఈ ప్రయోగంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆపరేషన్ నార్త్ కొరియా పేరుతో అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అమెరికా, ఉత్తర కొరియా దేశాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి.

యుద్ధం అంటూ హెచ్చరికలు
ఉత్తర కొరియా అణు పరీక్షలు ఆపకపోతే యుద్ధానికి దిగవలసి వస్తుందని అమెరికా హెచ్చరించగా, తమ దేశాన్ని రెచ్చగొడితే అణు యుద్ధానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా దీటుగా స్పందించింది. ఈ సమయంలోనే సంయుక్త విన్యాసాలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications