యూకేలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. 40 డిగ్రీలు దాటి.. ఫ్రాన్స్ లో రెడ్ అలెర్ట్..!
ఐరోపా దేశాలను తీవ్రమైన ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భూమధ్యరేఖకు దూరంగా సమశీతోష్ణ మండలంలో ఉండే యూరోప్ లో సాధారణంగా చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడి బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బ్రిటన్ లో జూన్ నెలలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఏకంగా 35.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. 1967 నాటి తీవ్రమైన వేడి తరంగాల తర్వాత బ్రిటన్‌లో నమోదైన అత్యంత వేడి జూన్ రోజు ఇదే కావడం గమనార్హం.
యూరోప్ అంతటా కనిపిస్తున్న ఈ వాతావరణ పరిణామాలు అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. బ్రిటన్ తో పాటు స్కాట్లాండ్ లో కూడా ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్టంగా 29.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు స్పెయిన్ దేశంలో కూడా ఎండలు మండుతున్నాయి. అక్కడ సాధారణ సగటు కంటే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైగా నమోదవడం విశేషం. 1950 తర్వాత జూన్ నెలలో ఈ స్థాయిలో సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ సంస్థలు నిర్ధారించాయి.
ఫ్రాన్స్ లో రెడ్ అలర్ట్
ఫ్రాన్స్ లో ఎండల తీవ్రత మరింత విపరీతంగా పెరిగింది. అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటిపోవడంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ గ్రిడ్ లపై భారం పెరిగి, ఉత్తర ఫ్రాన్స్ లో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండల వేడి నుంచి పర్యాటకులను రక్షించడానికి ప్రముఖ పర్యాటక ఆకర్షణలైన ఈఫిల్ టవర్, లూవ్ర్ మ్యూజియం వంటి సందర్శనీయ స్థలాల పనివేళలను అధికారులు భారీగా కుదించారు.
పొరుగు దేశమైన బెల్జియంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను హెచ్చరించారు. ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు సైతం ఎండల తీవ్రతపై గరిష్ట అప్రమత్తత ప్రకటించాయి. తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి తగిన మౌలిక వసతులు లేని ఈ ఐరోపా దేశాల్లో భద్రతా చర్యల కింద ఇప్పటికే వందలాది పాఠశాలలను మూసివేశారు. రవాణా రంగం కూడా ఈ వేడి తాకిడికి తీవ్రంగా ప్రభావితమైంది.

పశ్చిమ యూరోప్ వ్యాప్తంగా రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలకు ఈ వాతావరణ మార్పుల వల్ల భారీగా అంతరాయం ఏర్పడుతోంది. ఐరోపాలో సాధారణంగా వేసవి కాలం ఇంత తీవ్రంగా ఉండదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరిగిపోతోందనడానికి స్పష్టమైన నిదర్శనాలని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపరీత శీతోష్ణస్థితులు మరింత తరచుగా సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications