వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాన్‌బాస్‌ ఆక్రమణ : 2వేల మంది చిన్నారులను రష్యా కిడ్నాప్..? పుతిన్‌పై ఉక్రెయిన్ ఫైర్ ..!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత పెంచింది. ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. భవనాలను ధ్వంసం చేస్తోంది . దీంతో నగరాలన్ని మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ శ్మ‌శానాల‌ను తలపిస్తున్నాయి. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ మిస్సైల్స్‌తో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని, కీవ్, మరియూపోల్, ఖర్కీవ్‌ల‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నగరాల్లో పౌరులను రష్యా బలగాలు నిర్బందిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.

చిన్నారుల కిడ్నాప్


తాజాగా రష్యా పై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ అధీనంలోకి తెచ్చుకున్న డాన్‌బాస్ ప్రాంతంలో 2,389 మంది చిన్నారులు కన్పించడంలేదని పేర్కొంది. వారిని రష్యా సేనలే కిడ్నాప్ చేసినట్లు ఆరోపించింది. బాంబులతో విధ్వంసం సృష్టిస్తున్న రష్యా.. చట్టవిరుద్ధంగా తమ దేశ పౌరులను, చిన్నారులను అపహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డాన్‌బాస్ ప్రాంతం నుంచి చిన్నారులను అక్రమంగా తరలించిందని ఆవేద‌న‌ వ్యక్తం చేసింది.

మరియుపోల్‌లో ర‌ష్యా దాడులు


మరోవైపు ఉక్రెయిన్ ప్రధాన ఓడరేపు నగరమైన మరియుపోల్‌లో రష్యా సేనలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని హెచ్చరించింది. ఇక్కడ నుంచి సురక్షితంగా వెళ్లేందుకు తమ ఆయుధాలను వదిలి.. తెల్లజెండాలను ఎగురవేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఉక్రెయిన్ దళాలు వారి డిమాండ్ ను తిరస్కరించాయి. వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పింది. అటు ఇప్పటికే ఖేర్సన్ ప్రాంతాన్ని రష్యా సేనలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రష్యా సేనలకు వ్యతిరేకంగా నగరంలో నిరసనకు దిగిన పౌరులపై మాస్కో దళాలు కాల్పులు జరిపాయి. స్టన్ గ్రెనేడ్ విసిరారు. దీంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.

కీవ్‌లో విధ్వంసం..

ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా దాడులను మరింత పెంచింది. సెంట్రల్ కీవ్ లోని రైట్రోవిల్లే షాపింగ్ మాల్ పై బాంబులు విసిరింది అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడులకు దిగడంతో మాల్ తో పాటు చుట్టుపక్కల భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షడు పుతిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
Russia kidnaps 2,389 children in Donbos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X