రష్యాకు ఉక్రెయిన్ షాక్ : 16,100 మంది సైనికులు హతం.. యుద్ధ విమానాలు, ట్యాంకులు ధ్వంసం !

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దురాక్రమణకు దిగి నెల రోజులు పూర్తయింది. బాంబులు, క్షిపణులతో ఇంకా భీక‌ర దాడులకు తెగబడుతోంది. రాజధాని కీవ్‌తో పాటు మరియుపోల్, ఉర్కిన్ వంటి నగరాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. యుద్ధ భయంతో లక్షలాది మంది పౌరులు పొరుగుదేశాలకు వలస వెళ్లారు. ఉన్నవారికి క‌నీసం ఆహారం, తాగునీరు దొరక్క .. ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా ముప్పేట‌ దాడులను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. మాస్కో సైన్యం హస్త గతం చేసుకున్న ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నాయి.

ర‌ష్యా యుద్ధ సామాగ్రి ధ్వంసం


యుద్ధపోరులు ఇరుదేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అన్న విధంగా ఢీ కొడుతున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్-రష్యాలకు భారీగానే నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన 16,100 మంది సైనికులను ఉక్రెయిన్ ఆర్మీ హతమార్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా 111 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 53 యుఏవీలను కూల్చివేశారు. అటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను ఉక్రెయిన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఐదు యుద్ధ నౌకలు, 49 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ వ్యవస్థలను నాశనం చేశాయి. అయితే ఉక్రెయిన్ లెక్కలను రష్యా రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇప్పటివరకు 1351 మంది సైనికులు కోల్పోయినట్లు తెలిపింది. 3,825 మంది గాయపడ్డట్లు వెల్లడించింది. అదే స‌మ‌యంలో ఉక్రెయిన్ నుంచి నాలుగు లక్షమందికి పైగా పౌరులను సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలించినట్లు పేర్కొంది.

ర‌ష్యా సేన‌లు వెనుక‌డుగు

ర‌ష్యా సేన‌లు వెనుక‌డుగు


మరోవైపు ఉక్రెయిన్ దళాల ఎదురుదాడులకు పలుచోట్ల రష్యా సేనలు వెనుకడుగు వేస్తున్నాయి. మాస్కో సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు తూర్పువైపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలను, రక్షణ స్థావరాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ తమ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వెల్లడించింది. రష్యా సేనలను లాజిస్టిక్ సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపింది. కీవ్ నుంచి హోస్టోమెల్ ఎయిర్ ఫీల్డ్ వైపు రష్యా దళాలను వెనక్కి తరిమికొట్టేందుకు ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొంది. మైకోలైవ్‌ను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్న మాస్కో ప్రయత్నాలను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోందని తెలిపింది.

 ఉక్రెయిన్‌కు అండ‌గా నాటో..

ఉక్రెయిన్‌కు అండ‌గా నాటో..


రష్యా దూకుడును కట్టడి చేసేందుకు ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక, యుద్ధ సామాగ్రి సాయాన్ని అమెరికా, నాటో దేశాలు అందిస్తున్నాయి. దీంతో మాస్కో బలగాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా ప్రతిఘటిస్తోంది. గ‌త నెల రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులకు కొనసాగిస్తున్నా.. పూర్తి స్థాయిలో నగరాలను మాస్కో దళాలు ప‌ట్టుసాధించ‌లేక పోతున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌నే దీనికి కార‌ణం. అటు రష్యా సేనలను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటో దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. తమ ప్రజలను రక్షించుకోనేందుకు ఆంక్షలు లేని సైనిక సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+