‘‘ఉత్తరకొరియాతో జాగ్రత్త! కళ్లుమూసుకుని యుద్ధానికి దిగకండి..’’

టోక్యో: ఉత్తరకొరియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆచి తూచి అడుగేయాలని, కళ్లుమూసుకుని యుద్ధానికి దిగరాదని.. ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు.

జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలిసి అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో గుటెర్రస్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఈ మేరకు ఒక హెచ్చరిక చేశారు.

 UN orders North Korea to obey its nuclear weapons orders

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను నియంత్రించాలంటే ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పూర్తిస్థాయిలో అమలుపరచాలని ఆయన హితవు పలికారు. శాంతియుత మార్గంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, యుద్ధానిి దిగడం సరైన పద్ధతి కాదని ఆంటోనియో అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరిపింది.

దీనిని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌తోపాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఉత్తరకొరియా అధినేత కిమ్.. దేశ అణుశక్తిని మరింత బలోపేతం చేయాల్సిందిగా తమ దేశ మిలిటరీ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+