చైనాలో పరీక్షలలో కాపీ కొడితే డ్రోన్లు పట్టుకుంటాయ్
బీజింగ్: విద్యార్థులు పరీక్షలలో కాపీ కొట్టకుండా చూడటానికి చైనా సరికొత్త ఐడియా వేసింది. కాపీరాయుళ్లను పట్టుకొవడానికి ఇన్విజిలేటర్లు ఉంటారు. అయితే విద్యార్థులు మారుతున్న కాలంకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో ముందుకు వెలుతున్నారు.
రకరకాలుగా కాఫీలు కొడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా ఒక ఐడియా వేసింది. డ్రోన్లు తయారు చేసి విద్యార్థుల మీద ప్రయోగించింది. అంతే కాపీ కొడుతున్న వారిని డ్రోన్లు పట్టుకున్నాయి. చైనా ప్రయోగం సక్సెస్ అయ్యింది.
డ్రోన్లు గాలిలో ఎగురుతుంటే కొంత వరకు శబ్దం వస్తుంది. అయితే పరీక్షల సమయంలో కాపీ కొడుతున్న వారిని పట్టుకొవడానికి తయారు చేసిన డ్రోన్లలో ఎలాంటి శబ్దం రాకుండ జాగ్రతలు తీసుకున్నారు. అవి గాలిలో ఎగురుతున్న విషయం పైకి చూస్తే కాని ఎవరికి తెలియదు.

చైనాలో ప్రతి సంవత్సరం ప్రసిద్ది చెందిన యూనివర్శిటీల ఎంట్రన్స్ కోసం విద్యార్థులు గావోకావో అనే పరీక్షలు రాస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పరిక్షలకు దాదాపు 90 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతారు. ఇయిర్ ఫోన్ లు పెట్టుకుని, సరికొత్త టెక్నాలజీతో కాపీ కొట్టేవారిని పట్టుకొవడం కష్టం అయ్యిందని తెలుసుకున్న చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది.
టెక్నాలజీ ఉపయోగించి కాపీ కొట్టే వారిని ఈ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ ద్వార పసిగడుతున్నాయి. గతంలో చైనాలో విద్యార్థులు అత్యాధునికమైన కెమెరా పెన్ లు తీసుకు వచ్చి క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీసి పంపించేవారు. తరువాత బయట నుండి వచ్చే సమాదానాలు ఇయర్ ఫోన్లు ద్వార తెలుసుకుని సమాధానాలు రాసేవారు. ఇప్పుడు అలాంటి కాపీరాయుళ్లకు చెక్ పెట్టారు.












Click it and Unblock the Notifications