పహల్గామ్ ఉగ్రదాడిలో అనూహ్య పరిణామం: పాక్, చైనాలకు జాయింట్ గా చెక్
Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

తాజాగా ఈ ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తొయిబాకు అనుబంధంగా పని చేస్తోన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ధారించింది. దీనిపై తాజాగా నివేదిక విడుదల చేసింది. భద్రతమండలి టీఆర్ఎఫ్ పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి.
ఇది పాకిస్తాన్ ప్రోత్సాహిత సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన దౌత్యపరమైన పోరాటానికి మరింత బలం చేకూర్చినట్టయింది. లష్కరే తొయిబా అండదండలు లేకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఉండకపోవచ్చని పేర్కొంది. లష్కరే, టీఆర్ఎఫ్ మధ్య సంబంధం ఉందని కూడా భద్రత మండలి ఆరోపించింది.
1267 ఆంక్షల కమిటీ నివేదికతో సహా మానిటరింగ్ టీమ్ తీసుకున్న అన్ని నిర్ణయాలను భద్రత మండలి ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఐరాస మానిటరింగ్ టీమ్ ఈ నివేదికను విడుదల చేసింది.
భద్రత మండలి మానిటరింగ్ టీమ్ రిపోర్టులో టీఆర్ఎఫ్ పేరును చేర్చడం ద్వారా భారత్ ఓ ఘన విజయాన్ని సాధించినట్టయింది. పాకిస్తాన్ అబద్ధపు, మోసపూరిత ఆరోపణలను ఈ అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదిక ద్వారా ఎండగట్టినట్టయింది. ఇకపై దీని గురించి పాకిస్తాన్ లేదా దానికి సహాయ సహకారాలను అందించే చైనా గానీ మాట్లాడకపోవచ్చు.
పహల్గామ్ ఉగ్రదాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు టీఆర్ఎఫ్ తొలి రోజే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని కూడా మానిటరింగ్ టీమ్ తన నివేదికలో పొందుపరిచింది. సంఘటన చోటు చేసుకున్న స్థలానికి సంబంధించిన ఫొటోను కూడా ప్రచురించిందని భద్రత మండలి గుర్తు చేసింది.
ఏప్రిల్ 26న టీఆర్ఎఫ్ ఆ ప్రకటనను ఉపసంహరించుకుందని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదని నివేదిక పేర్కొంది. టీఆర్ఎఫ్ కాకుండా మరే ఇతర సంస్థ కూడా ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించకపోవడాన్ని గుర్తు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు స్వదేశీ రూపాన్ని ఇవ్వడానికి లష్కర్, జైషే వంటి ఉగ్రవాద సంస్థల నుండి దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" వంటి పేర్లను ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications