వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరువు తీస్తున్నారు: అమెరికాలో భారతీయులకు శిక్షలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో ఉన్న భారతీయుల్లో కొందరు ఉన్నత హోదాల్లో కొనసాగుతూ భారత్‌కు మంచి గుర్తింపు తీసుకొస్తుంటే.. మరికొందరు వివిధ నేరాలకు పాల్పడి దేశం పరువు తీస్తున్నారు. ఇటీవల వివిధ నేరాలకు పాల్పడిన పలువురు భారతీయులకు అక్కడి కోర్టులు శిక్షిలు విధించాయి.

మదుపరులను మోసగించి 60లక్షల డాలర్లను సొంతానికి వాడుకున్న భారతీయ స్టాక్ బ్రోకర్ సునీల్ శర్మ(68)ను అక్కడి న్యాయస్థానం దోషి తేల్చింది. ఇతనికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

US authorities nab Indian stock broker gulity of wire fraud

మరో కేసులో భారతీయ అమెరికన్ ఫిజీషియన్.. ఒక ఔషధ సంస్థ తమపై వచ్చిన అభియోగాలకు గానూ 37.75 లక్షల డాలర్లను చెల్లించడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఆరోగ్య బీమాలో 25 లక్షల డాలర్ల అవకతవకలకు పాల్పడిన కేసులో అంకుర్ రాయ్‌కు 75 నెలల కారాగార శిక్షను విధించారు.

2012నాటి ఇంకో కేసులో మైనర్ బాలికకు అసభ్య సందేశాలు పంపినందుకు నీలాంజన్ బ్రహ్మ(53) అనే వ్యక్తికి 21 నెలల జైలు శిక్ష పడింది. ఉద్యోగాలంటూ భారతీయుల్ని అక్రమ మార్గాన తీసుకువచ్చిన సందీప్ కుమార్ పటేల్‌కి రెండేళ్ల జైలు శిక్షతోపాటు 50వేల డాలర్ల జరిమానా విధించారు.

English summary
Sunil Sharma, 68, of California has been charged with wire fraud and faces a maximum 20 years in prison and a USD 250,000 fine. He will be sentenced by US District Judge John Houston in August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X