వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు పోయేకాలం వచ్చింది: అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే తాము చూస్తూ ఊరుకోమని, మీ శత్రువులతో చేతులు కలుపుతామని అమెరికాను హెచ్చరించింది. కాశ్మీర్ విషయంలో మా వాదనను అమెరికా అంగీకరించకపోవడంతో బిత్తరపోయిన పాక్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.

అమెరికా ఎంత మాత్రం ప్రపంచ శక్తికాదని పాక్ అంటుంది. భారత్, కాశ్మీర్ విషయంలో మా వాదనను పట్టించుకోకుంటే మేము రష్యా, చైనాతో చేతులు కలుపుతామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయోద్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా మేధోసంస్థ అయిన అట్లాంటిక్ కౌన్సిల్ లో సంప్రదింపులు ముగిసిన తరువాత ముషాహిద్ హుస్సేన్ సయోద్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఇక ముందు ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాలేదని, ప్రపంచాధిపత్యం తగ్గిపోతుందని, ఇక ఆ విషయం మరిచిపోదాం అన్నారు.

కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చెయ్యాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాయబారులను నియమించిన విషయం తెలిసిందే.

US a declining Power: says Pakistan

ఈ నేపధ్యంలో అమెరికాకు తమ వాదన వినిపించడానికి షరీఫ్ రాయబారులు ముషాహిద్ హుస్సేన్, షాజ్రా మన్సద్ యూఎస్ వెళ్లారు. అయితే వాదన వినిపించడానికి వచ్చిన పాక్ కు అమెరికా ఘాటుగా సందేశం ఇవ్వడంతో బిత్తరపోయింది.

కాశ్మీర్ అంశంపై ముషాహిద్ హుస్సేన్ అమెరికా ప్రతినిధులకు దాదాపు రెండు గంటపాటు వాదనలు వినిపించారు. అందుకు అమెరికా ఘాటుగా సందేశం ఇవ్వడంతో పాక్ ప్రతినిధులు నోటికి పని చెప్పారు. అమెరికాకు నేరుగా ఆ దేశంలోనే పాక్ హెచ్చరికలు జారీ చేసింది.

English summary
Pakistan PM Nawaz Sharif's Envoys Warn US, Say Pakistan Will Move Towards Russia and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X