వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ.. ట్రంప్‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్: జాలి చూపిన ట్విట్టర్: అసలు విషయం ఏమిటంటే?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతోన్న వేళ.. వరుసగా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయన చేసిన ఓ పోస్ట్‌ను తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల దాన్ని తొలగించినట్లు పేర్కొంది ఫేస్‌బుక్ యాజమాన్యం. అదే సమయంలో- డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన అదే సమాచారాన్ని ట్విట్టర్ తొలగించలేదు. దానిపై డేంజర్ లేబుల్‌ను మాత్రం అతికించి, వదిలి వేసింది.

Recommended Video

Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia

డొనాల్డ్ ట్రంప్ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు ఆయన మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సోమవారమే డిశ్చార్జి అయ్యారు. తన అధికారిక నివాస్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. కరోనా వైరస్ తీవ్రతను స్వయంగా అనుభవించారు. దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సాధారణ ఫ్లూ కంటే కరోనా వైరస్ ప్రమాదకరమైదేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

US election 2020: Facebook removes Trump post on Covid19 less deadly than flu

ఫ్లూ సీజన్ సమీపిస్తోందని, ప్రతి సంవత్సరమూ వేలాదిమంది దీని బారిన పడుతుంటారని ట్రంప్ పేర్కొన్నారు. ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఒక్కోసారి లక్షమంది వరకు అమెరికన్లు దీని బారిన పడి మరణిస్తుంటారని చెప్పారు. ఫ్లూ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశాన్ని మూసివేయలేమని చెప్పారు. రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేయలేమని అన్నారు. ఫ్లూతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌తో కలిసి ఎలా జీవిస్తున్నామో..ఫ్లూతోనూ అలాగే సహజీవనం చేయాల్సి ఉంటుందని అన్నారు.

వైట్‌హౌస్ మొత్తానికీ కరోనా అంటించిన ట్రంప్? అడ్వైజర్, ప్రెస్ సెక్రెటరీ, జర్నలిస్టులకు వైరస్వైట్‌హౌస్ మొత్తానికీ కరోనా అంటించిన ట్రంప్? అడ్వైజర్, ప్రెస్ సెక్రెటరీ, జర్నలిస్టులకు వైరస్

కరోనా వైరస్ తీవ్రతను తగ్గించేలా.. దీని కంటే ఫ్లూ అత్యంత శక్తిమంతంగా ఉందనే సందేశాన్ని డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా ఇచ్చినట్టయింది. ఈ పోస్టింగ్ తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందుకే దాన్ని తొలగించినట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం వెల్లడించింది. అదే సమచారాన్ని ట్రంప్.. ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశారు. ట్విట్టర్ యాజమాన్యం మాత్రం దాన్ని తొలగించలేదు. హైడ్ చేసింది. సెన్సెటివ్ ఇన్ఫర్మేషన్ అని పేర్కొంది. ఫ్లూ తీవ్రత కంట కరోనా వైరస్ మిగిల్చే విధ్వంసమే అధికంగా ఉందని తాము భావిస్తున్నట్లు అభిప్రాయపడింది.

English summary
Facebook has removed a post where President Donald Trump falsely claimed the novel coronavirus was less deadly than an ordinary flu. Earlier today, Trump wrote on Facebook and Twitter that America had “learned to live with” the upcoming flu season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X