అమరావతి సినిమా స్టైల్‌లో హత్య: మహిళకు మరణశిక్షఎలా అమలు చేశారంటే: 70 ఏళ్ల తరువాత
వాషింగ్టన్: గర్భిణీని హత్య చేసిన కిరాతక ఘటనలో దోషిగా తేలిన ఓ మహిళకు అమెరికా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. కొద్దిసేపటి కిందటే ఆమెకు విషపు ఇంజెక్షను ఇవ్వడం ద్వారా జైలు అధికారులు మరణశిక్షను అమలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల ప్రభుత్వ హయంలో మరణశిక్షను అమలు చేయడం ఇది 11వ సారి. ఓ మహిళకు అమెరికా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయడం 70 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ఫెడరల్ న్యాయస్థానం ఆమెకు విధించిన మరణశిక్షను యావజ్జీవంగా మార్చడానికి న్యాయవాది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

విషం నింపిన ఇంజెక్షన్..
చివరి నిమిషంలో ఆమె తరఫు అడ్వొకేట్ దాఖలు చేసిన పిటీషన్‌ను తోసిపుచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. ఆమె పేరు లిసా మోంట్‌గోమేరీ. వయస్సు 52 సంవత్సరాలు. అమెరికా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు మరణశిక్షను అమలు చేశారు. సరిగ్గా 1:31 నిమిషాలకు విషాన్ని నింపిన ఇంజెక్షన్‌ను ఆమెకు ఎక్కించారు. ఇండియానా టెర్రె హౌట్‌లోని ఫెడరల్ కరెక్షనల్ కాంప్లెక్స్‌లో ఆమెకు మరణశిక్షను అమలు చేశారు.

గర్భాన్ని చీల్చి.. పిండం ఎత్తుకెళ్లి
ఇదివరకు తెలుగులో వచ్చిన అమరావతి సినిమాను తలపించేలా హత్యోదంతం ఇది. 2004లో ఓ గర్భిణీని మోంట్‌గోమేరీ అతి దారుణంగా హత్య చేశారు. తొమ్మిది నెలల గర్భాణ్ని కత్తితో చీల్చివేశారు. కడుపులో పిండాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రెండేళ్ల తరువాత ఆమె అరెస్ట్ అయ్యారు. 2008లో ఆమెకు మిస్సోరీ న్యాయస్థానం మరణశిక్షను విధించింది. అప్పటి నుంచి ఇండియానాలోని జైలులో ఆమె గడుపుతూ వచ్చారు. నిర్దోషిగా నిరూపించడానికి ఆమె తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి- మోంట్‌గోమేరీ మానసిక స్థితి బాగాలేదని, ఆమెకు పిచ్చిపట్టిందని నిరూపించే ప్రయత్నం చేశారు.

పిచ్చి పట్టిందంటూ..
దానికి అవసరమైన సాక్ష్యాధారాలను అడ్వొకేట్లు సమర్పించలేకపోయారు. ఫెడరల్ చట్టాల ప్రకారం.. అనారోగ్యంతో ఉన్నవారిని, మానిసిక వికలాంగులకు మరణశిక్షను విధించే వీలులేదు. దీనితో మోంట్‌గోమేరీ మానసిక సమతౌల్యాన్ని కోల్పోయారంటూ వాదించినప్పటికీ.. ఆ దేశం సుప్రీంకోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తన క్లయింట్‌కు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖాయం చేసిందని కెల్లీ హెన్రీ తెలిపారు. మోంట్‌గోమేరీకి మరణశిక్షను విధించిన విషయాన్ని ధృవీకరించారు.

ఈ వారంలో మరో రెండు మరణశిక్షలు
అమెరికాలో ఈ వారం రోజుల వ్యవధిలో మరో రెండు మరణశిక్షలను అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు వాటి షెడ్యూల్‌ను కూడా ఫెడరల్ న్యాయస్థానం ప్రకటించింది. కోరే జాన్సన్ అనే దోషికి గురువారం మరణశిక్షను అమలు చేయాల్సి ఉంది. డస్టిన్ హిగ్స్ అనే దోషికి ఆ మరుసటి రోజు మరణశిక్షను అమలు చేస్తారు. నిజానికి- వారిద్దరికీ ఇదివరకే మరణశిక్షను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ బారిన పడటం వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు. వారిద్దరికీ కరోనా నెగెటివ్ రిపోర్ట్ రావడంతో. శిక్షను అమలు చేయడానికి చట్టపరంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?











Click it and Unblock the Notifications