వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: అమెరికాలో ఒక్కరోజే 2 వేల మంది మృతి, ఇటలీ తర్వాత యూఎస్, లక్షకు చేరిన మృతులు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అమెరికాపై పెను ప్రభావం చూపుతోంది. వైరస్ సోకిన జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత 24 గంటల్లో అమెరికాలో 2 వేల 108 మంది వైరస్ సోకి చనిపోయారు. వైరస్ విలయతాండవం చేసిన ఇటలీలో కూడా ఇన్ని మరణాలు ఒకేరోజు నమోదుకాలేదు. కానీ అమెరికాలో మాత్రం రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది.

అమెరికాలో 2108 మంది చనిపోయారని జాన్స్ హొప్కిన్స్ యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అక్కడ చనిపోయిన వారి సంఖ్య 18 వేల 586కి చేరుకున్నది. వైరస్ సోకిన వారి సంఖ్య 5 లక్షలకు చేరువవుతున్నది. 4 లక్షల 96 వేల 535 మందిగా ఉందని పేర్కొన్నది. గత 24 గంటల్లో35 వేల 98 పాజిటివ్ కేసులు నమోదవడం అగ్రరాజ్యాన్ని మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

US First Country To Record Over 2,000 Coronavirus Deaths In A Day: Report

కరోనా వైరస్ ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 18 వేల 849కి చేరింది. ఆ వెనకాలే అమెరికా నిలిచింది. తర్వాత స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. ఇటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. వైరస్ సోకి వివిధ దేశాల్లో లక్షలాది మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు.

Recommended Video

Mohan Babu Adopts 8 Villages In Chittoor District

English summary
United States on Friday become the first country to record more than 2,000 coronavirus deaths in one day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X