అమెరికా ఫస్ట్ లేడీకి కరోనా పాజిటివ్, బైడెన్‌కు మాత్రం నెగిటివ్
కరోనా కేసులు మళ్లీ కలవర పెడుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. అగ్రరాజ్య అధినేత బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆమె కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
జిల్ బైడెన్‌కు కరోనా లక్షణాలు ఉండటంతో నిన్న కూడా పరీక్షలు చేశారు. అయితే నెగిటివ్ వచ్చింది. ఇవాళ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ఒకరోజులో ఆమెకు జలుబు వచ్చింది. దాంతో పరీక్ష చేశారు. యాంటిజెన్ పరీక్ష నెగిటివ్ వచ్చింది. కానీ సందేహాం కలిగింది. వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేశారు. అందులో మాత్రం పాజిటివ్ వచ్చింది. అయితే వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు టెస్ట్ చేశారు. ఆయనకు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇటు అమెరికాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఫస్ట్ లేడీకి పాజిటివ్ వచ్చింది.
-
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
పరగడుపున నిమ్మరసం తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి












Click it and Unblock the Notifications