చైనాకు మరోషాకిచ్చిన అమెరికా: 200బిలియన్ డాలర్ల వస్తువులపై సుంకాల పెంపు
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఈ మధ్య కాలంలో ముగిసేట్లులేదు. తాజాగా, మరోసారి చైనాకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చైనా తన వాణిజ్య విధానాలను విధానాలను మార్చుకునేందుకు ఆసక్తికరంగా లేదని, అందుకే మరిన్ని సుంకాలు విధించినట్లు ట్రంప్ చెప్పారు. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి.

కాగా, ఈ 10శాతం ఏడాది చివరి వరకు మాత్రేమేనట. ఆ తర్వాత జనవరి 1, 2019 నుంచి ఇదే సుంకాన్ని 25శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు. 'భవిష్యత్‌లో చైనా మా రైతులు, ఇతర పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు దిగితే మేం వెంటనే మూడో దశ సుంకాల అమలు చేపడతాం. మరో 267 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తాం' అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
చైనా, అమెరికా మధ్య గత కొంత కాలంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తన అన్యాయపూర్వకమైన వాణిజ్య విధానాలను మార్చుకోవట్లేదని ఆరోపిస్తూ ఈ జూన్‌లోనే 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకాలను విధించింది.
-
US Refueling Aircraft Crash: ఇరాన్ వార్ లో అమెరికాకు అతిపెద్ద షాక్..! -
తల తెగినా పోరాడే సైన్యం! అమెరికాను వణికిస్తున్న జఫారీ! -
అజ్ఞాతంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్?.. అసలేమైంది? -
ఇరాన్‌తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఆ వెబ్‌సైట్‌నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications