Video: గగనతలంలో ఘోర ప్రమాదం, గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

ఆదివారం మధ్యాహ్నం ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూసేందుకు చేరిన వేలాది మంది కళ్లు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అమెరికాలోని ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ వద్ద జరుగుతున్న 'గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో' లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గగనతలంలో విన్యాసాలు చేస్తూ రెండు యూఎస్ నేవీకి చెందిన EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే, పైలట్ల చాకచక్యం వల్ల ఒక పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ సంచలన ఘటన జరిగిన కొద్దిసేపటికే అమెరికా రక్షణ రంగంలో మరో కీలక అప్‌గ్రేడ్ వార్త కూడా తెరపైకి వచ్చింది.

Two US Navy Electronic Warfare Jets Collide MidAir and Pentagon Orders One Billion Dollar F35 Stealth Fighter Kits

ఎయిర్‌షో రెండవ రోజు మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. నావల్ ఎయిర్ స్టేషన్ విడ్‌బే ఐలాండ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ అటాక్ స్క్వాడ్రన్ (VAQ-129) కి చెందిన జెట్‌లుగా వీటిని గుర్తించారు. విమానాలు ఢీకొన్న వెంటనే అందులోని నలుగురు సిబ్బంది పారాచూట్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని నేవీ కమాండర్ అమేలియా ఉమయం ధృవీకరించారు. విమానాలు నేలకూలడంతో ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. బేస్‌కు రెండు మైళ్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంపై రెస్క్యూ టీమ్స్ దర్యాప్తు ప్రారంభించాయి.

కొత్త శక్తులతో రీ-ఎంట్రీ ఇస్తున్న 'తేజస్’ యుద్ధ విమానాలు!
కొత్త శక్తులతో రీ-ఎంట్రీ ఇస్తున్న 'తేజస్’ యుద్ధ విమానాలు!

అమెరికా సరికొత్త వ్యూహం.. సూపర్ పవర్‌గా F-35!

మరోవైపు, ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానాల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు అమెరికా రక్షణ శాఖ (DoW) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన F-35 లైట్‌నింగ్ 2 స్టెల్త్ ఫైటర్ విమానాల కోసం దాదాపు ఒక బిలియన్ డాలర్ల (USD 991.1 మిలియన్లు) భారీ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కాంట్రాక్ట్‌ను ప్రముఖ రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌కు అప్పగించారు. దీని ద్వారా 432 అత్యాధునిక మోడిఫికేషన్ కిట్లను తయారు చేసి సరఫరా చేయనున్నారు.

అమెరికాలో 'తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్
అమెరికాలో 'తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్

ఈ అప్‌గ్రేడ్ కిట్లలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు 97, మెరైన్ కార్ప్స్‌కు 54, నౌకాదళానికి 42 కేటాయించనుండగా, మిగిలిన వాటిని విదేశీ కస్టమర్లకు, ఇతర మిత్రదేశాల భాగస్వామ్య విమానాలకు సమకూర్చనున్నారు. 'బ్లాక్ 4 ఆధునీకరణ' ప్యాకేజీలో భాగంగా జరుగుతున్న ఈ మార్పుల ద్వారా విమానాల క్షిపణి సామర్థ్యం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మరియు టార్గెట్ గుర్తింపు సామర్థ్యాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+