కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అడ్డుకట్ట వేయలేదు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సంచలనం

జెనీవా: కరోనావైరస్ మహమ్మారిని ఒక టీకా స్వయంగా ఆపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి సోమవారం చెప్పారు. మహమ్మారి సంభవించిన కొన్ని నెలల తరువాత, పాజిటివ్ కేసులు 54 మిలియన్లకు పైగా పెరగగా, 1.3 మిలియన్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Recommended Video

    COVID-19 Vaccine : కరోనా మహమ్మారిని ఒక టీకా ఏమీ చేయలేదు! - WHO Chief

    'ఒక టీకా మన వద్ద ఉన్న ఇతర సాధనాలను సహకరిస్తుంది కానీ, వాటిని భర్తీ చేయదు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఒక టీకా సొంతంగా మహమ్మారిని అంతం చేయదని స్పష్టం చేశారు.

    Vaccine Will Not Be Enough To Stop Pandemic: WHO Chief Tedros

    డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు శనివారం 660,905 కరోనావైరస్ కేసులను యూఎన్ ఆరోగ్య సంస్థకు నివేదించాయి. ఇదే ఇప్పటి వరకు అధికం కావడం గమనార్హం. ఆ సంఖ్య, శుక్రవారం నమోదైన 645,410, నవంబర్ 7 న నమోదైన మునుపటి రోజువారీ రికార్డు 614,013 ను అధిగమించాయి.

    టీకా సరఫరా మొదట్లో పరిమితం చేయబడుతుందని, "ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ఇతర ప్రమాద జనాభా(కు) ప్రాధాన్యత ఇవ్వబడుతుందని టెడ్రోస్ చెప్పారు. అది మరణాల సంఖ్యను తగ్గిస్తుందని, ఆరోగ్య వ్యవస్థలను భరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

    అయితే, ప్రజలు మరికొంత కాలంపాటు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని, కాంటాక్ట్ ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వివరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+