వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: ప్రధాని మోడీ వద్దకు వచ్చి అభినందించిన జో బైడెన్, దేశాధినేతలతో ఇలా

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. జీ7 సదస్సు సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంది. ప్రధాని మోడీ.. పలువురు ప్రపంచ దేశాధినేతలు కీలక భేటీలు నిర్వహించారు. ఆయా రంగాల్లో భారత్ చేస్తున్న కృషిని వివరించారు. ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్ తనవంతుగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ వద్దకు వచ్చి అభినందించిన జో బైడెన్

సోమవారం జర్మనీలోని ష్లోస్ ఎల్మౌలో గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌కు ముందు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య నవ్వులు విరిశాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా మోడీ ఉన్నారు.

బైడెన్, జస్టిన్ ట్రూడో, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో మోడీ భేటీ

మేలో క్వాడ్ సమ్మిట్ కోసం జపాన్‌లో ఇరువురు నేతలు భేటీ అయిన తర్వాత వీరిది ఇదే తొలి సమావేశం. భారతదేశం, ఇజ్రాయెల్, యూఏఈ, యుఎస్‌లతో కూడిన చతుర్భుజ ఆర్థిక వేదిక I2U2 వర్చువల్ సమ్మిట్ కోసం ఇద్దరు నాయకులు కూడా జూలైలో సమావేశం కాబోతున్నారని వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) నివేదించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జీ7 సమ్మిట్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలిశారు.

ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ కృషి చేస్తోందంటూ మోడీ

దక్షిణ జర్మనీలోని శిఖరాగ్ర సదస్సు వేదిక అయిన ష్లోస్ ఎల్మావు వద్దకు చేరుకున్న ప్రధాని మోడీకి జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ స్వాగతం పలికారు. వాతావరణం, ఇంధనం, ఆరోగ్యంపై G7 సెషన్‌లో ప్రధాని మోడీ గ్రీన్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ, స్థిరమైన జీవనశైలి, ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు. కాగా, జీ7 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతోనూ ప్రధాని మోడీ చర్చలు జరిపారు.

అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌తో మోడీ కీలక భేటీ

ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాల నాయకులు ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఆహార భద్రత, తీవ్రవాద వ్యతిరేకతతో సహా వివిధ ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు. అంతకుముందు ఆదివారం, జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌తో ప్రధాని మోడీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇరువురు నేతలు తమ మొదటి ద్వైపాక్షిక సమావేశంలో భారతదేశం, అర్జెంటీనా మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత లోతుగా చేయడం గురించి చర్చించారు.

English summary
Video: US President Biden Walks Up To PM Modi To Greet Him Ahead Of G7 Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X