Viral Video:రన్‌వేపై రెండుగా చీలిన బోయింగ్ విమానం-ప్రాణ నష్టం ఎంతంటే..?

కోస్టారికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బోయింగ్ 757-200 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం రెండుగా చీలింది. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇంతకీ ఏం జరిగింది..?

బోయింగ్ విమానంకు ప్రమాదం

బోయింగ్ విమానంకు ప్రమాదం

కోస్టారికాలో ఓ బోయింగ్ విమానం గాల్లో ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగాడు. పైలట్ అనుమతి అడిగిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. కోస్టారికాలోని జువాన్ శాంటమారియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వడంతో ఆ విమానం రన్‌వే పై సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.

రెండుగా చీలిన విమానం

ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాబట్టి ఆ విమానంకు ఏమైనా జరగొచ్చని భావించిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ విమానం ల్యాండ్ అవగానే ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే అది ప్రమాదంకు గురికావడంతో అక్కడి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆందోళన చెందారు. రన్‌వేపై ల్యాండ్ అయిన ఈ విమానం కాస్త దూరం ప్రయాణించి ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి హఠాత్తుగా రెండుగా చీలింది. దీంతో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది

ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు

ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు

రెండుగా చీలిన ఈ విమానంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు. కారణం ఈ విమానం ప్యాసింజర్ విమానం కాదు. గూడ్స్ విమానం. విమానంలో ఉన్న సిబ్బందికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే అందులోని ఒక సభ్యుడిని మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ టెస్టులకు పంపారు.

డీహెచ్‌ఎల్‌కు చెందిన విమానం

ఇక అసలు విషయానికొస్తే పసుపు రంగులో ఉన్న ఈ విమానం డీహెచ్‌ఎల్ సంస్థకు చెందినది. ఇది వస్తు రవాణా విమానం. ఈ విమానం రెండుగా చీలడంతో దీని తోక మరో రన్‌వేపై పడింది. ఓ రెక్క తెగి పడింది. విమానం ధ్వంసమైంది. అయితే అందులోని సరుకు మాత్రం నష్టం వాటిల్లలేదు. ఈ విమానం గ్వాటెమాల నగరానికి వెళుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని హైడ్రాలిక్ వ్యవస్థ పాడైందని కోస్టారిక సివిల్ ఏవియేషన్ అధికారి లూయిస్ మిరాండా మునోజ్ చెప్పారు. ఇది గమనించిన పైలట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారని తెలిపారు.

ఐదుగంటలపాటు ఎయిర్‌పోర్ట్ బంద్

ఐదుగంటలపాటు ఎయిర్‌పోర్ట్ బంద్

ప్రస్తుతం రన్‌వేపై నుంచి ఆ విమానంను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయం కాసేపు మూతపడింది.ఆ తర్వాత తెరుచుకుంది. ఈ విమానం రన్‌వేపై క్రాష్ అవడంతో దాదాపు 8500 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు. దాదాపు 57 వాణిజ్య విమానాల రాకపోకలకు బ్రేక్ పడింది. మొత్తంగా ఐదు గంటల పాటు ఎయిర్‌పోర్టును మూసివేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+