‘G7 అని ఎందుకు పిలుస్తారో తెలియదు!’: బ్రిక్స్ వేదికగా పుతిన్ షాకింగ్ కామెంట్స్!!
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు సవాళ్లపై కీలక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ7 కూటమి ఆదిపత్యాన్ని ప్రశ్నిస్తూ .. ప్రపంచ జీడీపీలో వారి వాటా క్షీణిస్తోందని, బ్రిక్స్ కూటమి శక్తిగా ఎదుగుతోందని తెలిపారు.
బ్రిక్స్ బిజినెస్ సమ్మిట్ 2026లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ.. "ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 దేశాల వాటా సుమారు 18 శాతం కాగా.. బ్రిక్స్ సభ్య దేశాల వాటా సుమారు 40 శాతం అని అన్నారు. "వాటిని అలా జీ7 ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు" అంటూ పుతిన్ ఆ కూటమి ప్రాముఖ్యతను ప్రశ్నించారు. జీ7లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలు ఉన్నాయి. పుతిన్ బ్రిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కూటమిగా అభివర్ణించారు. ప్రపంచ క్రమం మారుతున్న కొద్దీ, దాని సభ్య దేశాల శక్తి, ప్రభావం కూడా పెరుగుతోందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న పెరుగుతున్న తోడ్పాటును రష్యా అధ్యక్షుడు గుర్తించారు. ప్రపంచం ఓ ప్రధాన ఆర్థిక పరివర్తనకు లోనవుతోందని, బ్రిక్స్ కూటమి వెలుపల ఉన్న దేశాలతో సహకరించుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

పాశ్చాత్య దేశాలు బ్రిక్స్ దేశాలను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. పుతిన్ మాట్లాడుతూ.."పాశ్చాత్య దేశాలు రష్యాపై అన్యాయమైన ఆంక్షలు విధిస్తూ వారి పూర్వపు ఆధిపత్యం కోసం అక్రమ పద్ధతులను వాడుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటున్నాం. ప్రపంచ ఆర్థిక మార్పుల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను పోషిస్తోంది" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
బ్రిక్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "ఈ ఏడాది మనం బ్రిక్స్ 20 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 2006లో ఈ కూటమిని ప్రారంభించినప్పుడు ఇందులో కేవలం 4 దేశాలు మాత్రమే ఉండేవి. నేడు బ్రిక్స్, దాని భాగస్వాములతో కలిపి మనకు 21 దేశాల కుటుంబం ఉంది. ఈనాడు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50 శాతం, జీడీపీలో 40 శాతం, వాణిజ్యంలో 25 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరాలలో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు పెరగగా.. బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ సుమారు నాలుగున్నర రెట్లు పెరిగింది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచ ఆవిష్కరణలు, పరిష్కారాలకు బ్రిక్స్ దేశాలు కూడా కీలక కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. "క్షేత్రస్థాయి కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు మన దేశాల్లో ఆవిష్కరణలకు కొత్త మార్గాలు రూపుదిద్దుకుంటున్నాయి. బ్రిక్స్ పెరుగుతున్న పరిధి, వేగం, అంచనాలు మనందరిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన బ్రిక్స్ వ్యాపార వేదికలలో ఇదే అతిపెద్దది." అని ప్రధాని మోదీ తెలిపారు.
మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు
శుక్రవారం భారత్ మండపంలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
BREAKING: Russian President Putin slams Western economies at BRICS
— Shashank Mattoo (@MattooShashank) September 11, 2026
"We are told competition is sacrosanct and not to be touched by our Western competitors who are doing everything to get their competitive edge back. But this competition is taking ugly forms." pic.twitter.com/Ut93xzfEZJ













Click it and Unblock the Notifications
